Prince Trailer : ఇండియా అబ్బాయి-బ్రిటిష్ అమ్మాయి లవ్ స్టోరీ.. జాతిరత్నాలు డైరెక్టర్ ‘ప్రిన్స్’ ట్రైలర్ చూశారా??

జాతిరత్నాలు సినిమాతో అందర్నీ ఫుల్ గా నవ్వించి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ అనుదీప్. ఇక తమిళ సినిమాలు చేస్తూనే వాటని తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు హీరో శివకార్తికేయన్. ఇటీవల వరుసగా హిట్స్ కొడుతూ............

Prince Trailer : ఇండియా అబ్బాయి-బ్రిటిష్ అమ్మాయి లవ్ స్టోరీ.. జాతిరత్నాలు డైరెక్టర్ ‘ప్రిన్స్’ ట్రైలర్ చూశారా??

Shiva Karthikeyan and anudeep Prince Movie Trailer Released

Prince Trailer :  జాతిరత్నాలు సినిమాతో అందర్నీ ఫుల్ గా నవ్వించి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ అనుదీప్. ఇక తమిళ సినిమాలు చేస్తూనే వాటని తెలుగులో డబ్ చేసి ఇక్కడ కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు హీరో శివకార్తికేయన్. ఇటీవల వరుసగా హిట్స్ కొడుతూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శివకార్తికేయన్. హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న వీరిద్దరి కాంబినేషన్ లో ప్రిన్స్ సినిమా రాబోతుంది. ఇందులో ఉక్రెయిన్ భామ మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఒక స్కూల్ లో హీరో, హీరోయిన్స్ టీచర్స్ గా పనిచేస్తూ ప్రేమలో పడతారు. అక్కడ సరదా సన్నివేశాలు, పాటలు, వీరి ప్రేమని హీరోయిన్ సైడ్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వచ్చే కష్టాలు, హీరో వేరే దేశం అమ్మాయిని ప్రేమించాడని ఊళ్ళో వాళ్ళు అతనిని తిట్టడం, కొన్ని కామెడీ సీన్స్, కులం, మతం లేదు అందరు ఒక్కటే అని తిరిగే హీరో నాన్న నువ్వు ఏకంగా వేరే దేశం అమ్మాయినే ప్రేమించావా అని హీరోని పొగడటం.. ఇలా సరదాగా ఓ లవ్, ఎమోషన్ కథని తీసినట్టు తెలుస్తుంది. చివర్లో నేనొక్కడ్నే నిజమైన దేశ భక్తుడిని.. ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేది పాటించి బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించాను అని శివకార్తికేయన్ చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉంటుంది.

NC 22 : సీరియస్ అయిన కన్నడ ప్రజలు.. నాగచైతన్య సినిమాకి షాక్ ఇచ్చిన కన్నడ ప్రభుత్వం..

అయితే జాతిరత్నాలు రేంజ్ లో కామెడీ ఉండకపోవచ్చు. ఆ జోనర్ నుంచి బయటకి వచ్చి దర్శకుడు లవ్, ఎమోషన్ తో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రిన్స్ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేస్తుండగా రెండు చోట్ల మంచి అంచనాలు నెలకొన్నాయి.