Duniya Vijay : బాలయ్య విలన్‌కి బర్త్‌డే విషెస్.. | Duniya Vijay

Duniya Vijay : బాలయ్య విలన్‌కి బర్త్‌డే విషెస్..

బాలయ్య-గోపిచంద్ మలినేని సినిమాలో విలన్‌గా పాపులర్ కన్నడ స్టార్ ‘దునియా’ విజయ్ నటిస్తున్నారు..

Duniya Vijay : బాలయ్య విలన్‌కి బర్త్‌డే విషెస్..

Duniya Vijay: పాపులర్ కన్నడ స్టార్ హీరో ‘దునియా’ విజయ్ పుట్టినరోజు నేడు (జనవరి 20). ఈ సందర్భంగా పలు ఇండస్ట్రీలకు చెందిన సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.

Akhanda : 200 కోట్ల క్లబ్‌‌లో ‘అఖండ’!

కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ‘దునియా’ విజయ్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ-యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌తో ఆయన తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు.

Akhanda 50 Days Jathara : బాలయ్య బాక్సాఫీస్ ‘మాస్ జాతర’.. ‘అఖండ’ గర్జనకు 50 రోజులు..

టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ NBK 107 మూవీని ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించనుంది. ఈ సినిమాలో బాలయ్యకి పవర్‌ఫుల్ విలన్‌గా ‘దునియా’ విజయ్ నటిస్తున్నారు. దీని గురించి కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ క్లారిటీ లేదు.

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

‘దునియా’ విజయ్ బర్త్‌డే సందర్భంగా ఆయనతో తీసుకున్న పిక్ షేర్ చేస్తూ డైరెక్టర్ గోపిచంద్ మలినేని పోస్ట్ చెయ్యడంతో.. NBK 107 లో ఆయన నటించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. బాలయ్య పక్కన శృతి హాసన్ కథానాయికగా కనిపించనుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ మీదకెళ్లబోతుంది.

×