Chollangi Amavasya: జనవరి 18.. ఆదివారం చొల్లంగి అమావాస్య.. చాలా పవర్ ఫుల్.. ఇలా చేస్తే అఖండ రాజయోగం..!

రోజంతా అలానే ఉంచి మరునాడు ఆ నీళ్లను మొక్కలకు పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అదృష్టం కలుస్తుందని పండితులు చెబుతున్నారు.

Chollangi Amavasya: జనవరి 18.. ఆదివారం చొల్లంగి అమావాస్య.. చాలా పవర్ ఫుల్.. ఇలా చేస్తే అఖండ రాజయోగం..!

Updated On : January 18, 2026 / 1:53 AM IST
  • దగ్గరలో ఉన్న జీవ నదిలో స్నానం చేయాలి
  • గాజు పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పచ్చ కర్పూరం కలపాలి
  • సూర్యాస్తమయం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపం పెట్టాలి

Chollangi Amavasya: జనవరి 18న పుష్య మాస అమావాస్య వచ్చింది. దీన్ని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారం, అమావాస్య కలిసి వస్తే చాలా అద్భుతమైన రోజుగా, శక్తిమంతమైన రోజుగా, దోషాలన్నీ పోగొట్టుకునే రోజుగా, పూజలు చేసే రోజుగా ప్రామాణిక గ్రంథాలు తెలుపుతున్నాయని పండితులు చెబుతున్నారు. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అఖండ రాజయోగాన్ని సిద్ధింప జేసుకోవచ్చన్నారు.

పుష్య మాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అని పిలుస్తారని.. ఈ రోజున దగ్గరలో ఉన్న జీవ నదిలో స్నానం చేయాలని పండితులు తెలిపారు. స్నానం చేసిన తర్వాత పితృ దేవతలకు నల్ల నువ్వులు కలిపిన నీళ్లు (తర్పణం) వదలాలి. ఇలా చేయడం వల్ల పితృ దోషాలు తొలుగుతాయని వెల్లడించారు.

ఇక ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే, ఇంట్లో వారికి అదృష్టం కలిసి రావాలంటే.. ఇంట్లో అంతా ఉదయం స్నానం చేశాక గాజు పాత్రలో నీళ్లు తీసుకుని అందులో పచ్చ కర్పూరం కలపాలి. ఆ నీళ్లను ఇంటి గుమ్మం లోపల వైపు మూలన ఉంచాలి. రోజంతా అలానే ఉంచి మరునాడు ఆ నీళ్లను మొక్కలకు పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, అదృష్టం కలుస్తుందని పండితులు చెబుతున్నారు.

అలాగే ఆదివారం, అమావాస్య కలిసి వచ్చిన రోజున అందరూ తప్పకుండా లక్ష్మీదేవికి మిరియపు గంధాన్ని సమర్పించాలి. ఒక మిరియం తీసుకుని నీళ్లతో తడి చేసి అరగదీస్తే గంధంలా వస్తుంది. దాన్ని మిరియపు గంధం అంటారు. ఈ మిరియపు గంధంతో లక్ష్మీదేవి ఫోటోకు బొట్టు పెట్టాలి. లక్ష్మీదేవికి మిరియాల వడలు నైవేద్యంగా పెట్టి కుటుంబంలో అందరూ ప్రసాదంగా తీసుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందని పండితులు వెల్లడించారు.

కను దిష్టి, శత్రు బాధలు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతాయి..!

ఇక, ఎదుటి వారి ఏడుపులు, కను దిష్టి, శత్రు బాధలు, ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు సూర్యాస్తమయంలో దీపం వెలిగించాలని తెలిపారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 5 గంటల 45 నిమిషాల మధ్యలో ఈ దీపం పెట్టాలి. ఇంటి గుమ్మం ముందు రెండు చెట్టు ఆకులను ఉంచాలి. ఏ చెట్టు అయినా పర్లేదు. చెట్టు ఆకులు లేకపోతే రెండు తమలపాకులైనా ఉంచండి.

చెట్టు ఆకులపై రాళ్ల ఉప్పుని కుప్పలా పోయాలి. ఆ రాళ్ల ఉప్పులో కొన్ని నల్ల నువ్వులు వేయాలి. ఆ నల్ల నువ్వుల మీద ఒక కొత్త మట్టి ప్రమిద ఉంచాలి. దానిపై మరో కొత్త మట్టి ప్రమిద ఉంచాలి. అందులో నువ్వుల నూనె పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇది చాలా శక్తిమంతమైన దీపం అని పండితులు చెబుతున్నారు. ఆదివారంతో కూడిన అమావాస్య రోజు సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఈ దీపం పెడితే నెగిటివ్ ఎనర్జీ పోతుందన్నారు. బ్లాక్ మ్యాజిక్స్ ప్రభావం ఉండదన్నారు. శత్రు బాధలు, కను దిష్టి తొలగిపోతాయని, ఇంట్లో వారందరికీ అదృష్టం కలిపి వస్తుందని వివరించారు.

రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం బిళ్లను చేతిలో పెట్టుకుని ఇళ్లంతా తిరగాలి. తర్వాత ఇంటి బయటకు వచ్చి కర్పూరం వెలిగించాలి. దీని వల్ల కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని, అదృష్టం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.

కొన్ని నల్ల నువ్వులు, ఎండు మిరపకాయలు చేతిలో లేదా పళ్లెంలో పెట్టుకుని ఇళ్లంతా తిరగాలి. ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా ఇలా చేయొచ్చు. ఇళ్లంతా తిరిగాక బయటకు వచ్చి ఎవరూ తొక్కని చోట చెట్టు దగ్గర నువ్వులు, మిరపకాయలు వేయాలి. ఉదయం పూట అయితే దగ్గరలో పారే నీటిలో వేయాలి. ఈ శక్తిమంతమైన పరిహారాలు.. ఆదివారంతో కూడిన అమావాస్య రోజున చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. ఆదివారం రోజున అమావాస్య కలిసి వచ్చిన రోజు అందరూ సూర్యుడికి ప్రత్యేకంగా అర్గ్యం ఇవ్వాలి. ఎందుకంటే అమావాస్య సూర్యుడు పుట్టిన తిధి.

దానాలు చేయాలి..

ఆదివారం సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆదివారం, అమావాస్య కలిసి వచ్చినందున ఉదయం స్నానం చేశాక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని ఎర్ర పుష్పాలు, బెల్లం ముక్క వేసి తూర్పు వైపు తిరిగి ఆ నీళ్లను మొక్కలో విడవాలి. అలా విడిచి పెట్టే సమయంలో ఓం గృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చదువుకోవాలి. ఇలా చేయడం చాలా మంచిది. అలాగే దానాలు (అన్నదానం, వస్త్రదానం, గోధుమలు, బెల్లం) ఇస్తే చాలా మంచిది. ఆమావాస్యతో కూడిన ఆదివారం సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. గోధుమలు దానం ఇచ్చినా, బెల్లం దానం ఇచ్చిన ఏడాది మొత్తం కెరీర్ లో అద్భుతమైన సక్సెస్ ఉంటుందన్నారు. ప్రమోషన్లు తొందరగా వస్తాయన్నారు.

ఆదివారం అమావాస్య చాలా శక్తిమంతమైన రోజు కాబట్టి సూర్యదయానికి ముందే తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య ఇంటి ముందు పసుపు రాసి గుమ్మడి కాయ కట్టండి. ఆదివారంతో కూడిన అమావాస్య రోజున ఇలా గుమ్మడి కాయ కడితే అది పవర్ ఫుల్ గా పని చేస్తుందని పండితులు తెలిపారు.

ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టాలి..

ఇలా చేస్తే బ్లాక్ మ్యాజిక్స్ పని చేయవు. దృష్టి దోషాలు ఉండవు, శత్రు బాధలు ఉండవని తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంలో (దుర్గ, కాళి, చండి, మహిషాసుర మర్దిని, గ్రామ దేవతల స్వరూపాలు) 4 నిమ్మదొప్పల్లో (రసం తీసేసినవి) నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తే.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అన్ని రకాలైన శత్రు బాధలు, కోర్టు సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ పోతాయన్నారు.

Also Read: 2026లో నరదిష్టి ఎక్కువగా తగిలే రాశులు ఇవే..! ఇలా చేస్తే సులభంగా బయటపడతారు..!

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.