‘సోలో బ్రతుకే సో బెటర్’ టీమ్ విషెస్ ‘హ్యాపీ సింగిల్స్ డే’
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుండి ‘హ్యాపీ సింగిల్స్ డే’ విషెస్ చెబుతూ న్యూ పోస్టర్ విడుదల..

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ నుండి ‘హ్యాపీ సింగిల్స్ డే’ విషెస్ చెబుతూ న్యూ పోస్టర్ విడుదల..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా నటిస్తున్న సినిమా.. ‘సోలో బ్రతుకే సో బెటర్’.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రీసెంట్‌గా ‘హ్యాపీ సింగిల్స్ డే’ అంటూ న్యూ పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ‘డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ సింగిల్ ఆర్మీ, హ్యాపీ సింగిల్స్ డే.. ఎప్పుడైనా, ఎక్కడైనా సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు తేజు..
మారుతి దర్శకత్వంలో తేజు, రాశీఖన్నా జంటగా నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ డిసెంబర్ 20న విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : వెంకట్ సి దిలీప్, ఎడిటింగ్ : నవీన్ నూలి, ఆర్ట్ : అవినాష్ కొల్లా. ప్రొడక్షన్ డిజైనింగ్ అందించనున్నారు.
Dear brothers and sisters of Single Army, ✊
Happy Singles Day.. Eppudaina Ekkadaina #SoloBratukeSoBetter?#SoloBratukeSoBetter #happysinglesday #JaiSingleArmy @SVCCofficial @MusicThaman @NabhaNatesh pic.twitter.com/GuBL6yAHme— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2019