Hansika Motwani: అభిమానుల మీద అంత ప్రేమ ఉంటే.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయవచ్చుగా.. స్టార్ హీరోయిన్స్‌పై అభిమానుల సెటైర్లు..

సౌత్ టూ నార్త్ వరుసగా స్టార్ హీరోయిన్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రినా కైఫ్, అలియా భట్, నయనతార తాజాగా హన్సిక. అయితే ఇటీవల తమ పెళ్లి వీడియోను డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ కి అమ్మడం ఫ్యాషన్ అయ్యిపోయింది. ఈ పద్ధతిపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hansika Motwani: అభిమానుల మీద అంత ప్రేమ ఉంటే.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేయవచ్చుగా.. స్టార్ హీరోయిన్స్‌పై అభిమానుల సెటైర్లు..

If you have so much love for fans you can upload your wedding video on YouTube

Hansika Motwani: సౌత్ టూ నార్త్ వరుసగా స్టార్ హీరోయిన్లు అందరూ పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కత్రినా కైఫ్, అలియా భట్, నయనతార తాజాగా హన్సిక. అయితే ఇటీవల తమ పెళ్లి వీడియోను డాక్యుమెంటరీగా చిత్రీకరించి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ కి అమ్మడం ఫ్యాషన్ అయ్యిపోయింది. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకోగా.. ఆ పెళ్లి వీడియో రైట్స్ ని ప్రైమ్ వీడియోకి దాదాపు రూ.80 కోట్లకు అప్పజెప్పారు.

Hansika : హన్సిక కాబోయే భర్తకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా.. అది కూడా హన్సిక ఫ్రెండ్ తోనే??

ఈ వరుసలోనే సౌత్ ఇండియన్ లేడీ మెగాస్టార్ నయనతార కూడా.. తన పెళ్లి వీడియో రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థకు రూ.25 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అదే బాటలో నడుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వాని తన వ్యాపార భాగస్వామి సోహైల్ కతురియాతో వివాహానికి సిద్ధం కాగా, తన వివాహ వీడియోను డిస్నీ+హాట్‌స్టార్‌కి బేరం పెట్టినట్లు తెలుస్తుంది.

ఈ పద్ధతిపై సినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఎవరు లేకుండా ఎక్కడో చేసుకోవడం, దాని డాక్యుమెంట్ చేసి అమ్ముకోవడం. ఇదేంటి అని అడిగితే, మా అభిమానులు కూడా ఈ వేడుకను చూడాలని కోరుకుంటున్నాము అని బదులివ్వడం. మీకు మీ అభిమానుల మీద అంత ప్రేమ ఉంటే యూట్యూబ్‌లో అప్లోడ్ చేయవచ్చుగా, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ కి ఇచ్చి కాష్ చేసుకోవడం ఎందుకు” అంటూ సైటర్లు వేస్తున్నారు.