Kamal Haasan : తన మాస్టర్‌ని కలుసుకుని.. దీవెనలు తీసుకున్న కమల్ హాసన్..
ఉలగనాయగన్ కమల్ హాసన్ తన గురు కె విశ్వనాధ్ ని కలుసుకుని అయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈ ఏడాది 'విక్రమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమల్ హాసన్ భారీ విజయాన్ని అందుకుని, అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. కాగా బిజినెస్ పని మీద బుధవారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ తన గురువు కె విశ్వనాధ్ ఇంటికి...

Kamal Haasan met his master K Viswanath
Kamal Haasan : ఉలగనాయగన్ కమల్ హాసన్ తన గురు కె విశ్వనాధ్ ని కలుసుకుని అయన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఈ ఏడాది ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమల్ హాసన్ భారీ విజయాన్ని అందుకుని, అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేసేలా తన తదుపరి సినిమాలు కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.
Kamal Haasan : కమలహాసన్ మూవీలో విలన్‌గా.. మరోసారి ఆ స్టార్ హీరో..
కాగా బిజినెస్ పని మీద బుధవారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ తన గురువు కె విశ్వనాధ్ ఇంటికి వెళ్లి గౌరవపూర్వకంగా కలిశాడు. చాలా రోజులు తరవాత విశ్వనాధ్ ని కలిసిన కమల్.. అయన యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అలాగే అయన దీవెనలు తీసుకున్న కమల్, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘మాస్టర్ ని కలిశాను’ అంటూ తెలియజేశాడు.
గతంలో వీరిద్దరి కలయికలో సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ ఆణిముత్యాలని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికి మర్చిపోలేరు. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2ను తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ న్యూ షెడ్యూల్ వచ్చే నెల మొదలు కానుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్‌సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.