Kannada Movies : డిమాండ్ లో కన్నడ సినీ పరిశ్రమ.. హీరోలు, డైరెక్టర్లు ఎవ్వరూ తగ్గట్లేదు..

టాలీవుడ్ లాగానే ఇప్పుడు కన్నడ సినిమా కూడా వెలిగిపోతోంది. ‘కాంతార’ సూపర్ సక్సె్స్ తో దాని రేంజ్ పీక్స్ కు చేరింది. ఆ క్రెడిట్ తో ఇప్పుడు కన్నడ హీరోలకు, దర్శకులకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. వారి అప్ కమింగ్ మూవీస్ పై ఆడియన్స్ లో...............

Kannada Movies : డిమాండ్ లో కన్నడ సినీ పరిశ్రమ.. హీరోలు, డైరెక్టర్లు ఎవ్వరూ తగ్గట్లేదు..

Kannada Movies, heros and directors gets demand all over india

Kannada Movies :  టాలీవుడ్ లాగానే ఇప్పుడు కన్నడ సినిమా కూడా వెలిగిపోతోంది. ‘కాంతార’ సూపర్ సక్సె్స్ తో దాని రేంజ్ పీక్స్ కు చేరింది. ఆ క్రెడిట్ తో ఇప్పుడు కన్నడ హీరోలకు, దర్శకులకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. వారి అప్ కమింగ్ మూవీస్ పై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో ఇంట్రెస్ట్ మొదలైంది.

‘కేజీఎఫ్’ తర్వాత ఒక్క కన్నడ మార్కెట్టే కాదు, కన్నడ సినిమాల క్వాలిటీ కూడా బాగా పెరిగింది. కథాంశాల తీరులో కూడా గొప్ప మార్పులొచ్చాయి. ఇన్నోవేటివ్ థాట్స్ కలిగిన యంగ్ డైరెక్టర్స్ శాండిల్ వుడ్ లో ఎంట్రీ ఇస్తుండడంతో ఇప్పుడందరూ తమ సినిమాల గురించి గొప్పగా చెప్పుకొనే స్థాయికి ఎదుగుతోంది. కొంత కాలంగా అక్కడ రిలీజ్ అవుతున్న సినిమాల కాన్సెప్స్ట్ గమనిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ‘గరుడ గమన వృషభ వాహన, చార్లి 777, విక్రాంత్ రోణా’ లాంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకొనేలా చేశాయి. ఇప్పుడు లిస్ట్ లోకి ‘కాంతార’ మూవీ కూడా వచ్చి చేరింది. కేజీఎఫ్ సిరీస్ నే తలదన్నే రీతిలో కలెక్షన్స్ సాధిస్తుండడంతో ఇప్పుడు రిషభ్ శెట్టితో పాటు మిగిలిన కన్నడ హీరోల సినిమాల గురించి కూడా టాలీవుడ్ జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

‘కాంతార’ గ్రాండ్ సక్సెస్ తో రిషభ్ శెట్టితో సినిమాలు తీసేందుకు మిగిలిన భాషల్లో కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. టాలీవుడ్ లో అయితే అల్లు అరవింద్ అతడితో సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు కూడా. ఇక కేజీఎఫ్, కాంతార పేరు చెప్పుకొని శాండల్ వుడ్ లోని స్టార్ హీరోలంతా తమ తాజా చిత్రాల్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, ధ్రువ సర్జా, ఉపేంద్ర, సుదీప్ లాంటి వారు టాలీవుడ్, బాలీవుడ్ మెయిన్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నారు. వారి సినిమాలపై టాలీవుడ్ ఆడియన్స్ లోనూ ఆసక్తిమొదలైంది.

Janhvi kapoor : నేను, మా నాన్న ధనవంతులం కాదు.. జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తన ‘ఘోస్ట్’ సినిమాని పాన్ ఇండియా ఫిలిం రేంజ్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కేడీ ది డెవిల్’ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా ‘కబ్జా’ అనే మల్టీస్టారర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇలా టాలీవుడ్ హీరోలు, దర్శకులంతా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

కర్ణాటక బయట కూడా కన్నడ సినిమాలకి అదే డిమాండ్ ఉంది. కన్నడ హీరోలకి కూడా గతంతో పోలిస్తే క్రేజ్ ఇప్పుడు ఇంకా పెరిగింది. కన్నడలో హిట్స్ ఇచ్చిన హీరోలకి, దర్శకులకి బయటి సినీ పరిశ్రమల నుంచి కూడా ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు చిన్న పరిశ్రమగా అసలు 50 కోట్ల సినిమా కూడా లేని పరిశ్రమ ఇప్పుడు ఇండియాలోనే పెద్ద మార్కెట్ గా అవతరించింది అంటే చాలా గొప్ప విషయమే అని చెప్పొచ్చు.