Karthi : ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమని ఇస్తున్నారు.. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది..

బుధవారం సాయంత్రం సర్దార్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ నాగార్జునతో........

Karthi : ఎవర్రా మీరంతా.. ఇంత ప్రేమని ఇస్తున్నారు.. ఖైదీ 2 నెక్స్ట్ ఇయర్ రాబోతుంది..

Karthi speech in Sardar telugu pre release Event

Karthi :  కార్తీ హీరోగా, రాశిఖన్నా, రాజీషా విజయం హీరోయిన్స్ గా, ఒకప్పటి హీరోయిన్ లైలా ముఖ్యపాత్రలో పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్‌’. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. దీపావళి కానుకగా ఈ నెల 21న సర్దార్ విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్ పై ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

బుధవారం సాయంత్రం సర్దార్ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి నాగార్జున అతిధిగా విచ్చేశారు. కార్తీ మాట్లాడే ముందు యుగానికి ఒక్కడు సినిమాలోని డైలాగ్ ఇక్కడ బాగా ఫేమస్ అవుతుందట.. ఎవర్రా మీరంతా అని చెప్పి ఇంత ప్రేమని చూపిస్తున్నారు అని అభిమానులతో ముచ్చటించారు. ఈ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ నాగార్జునతో ఊపిరి సినిమా నుంచి తనకున్న రిలేషన్ గురించి తెలిపారు. ఒక అన్నయ్యలా, హైదరాబాద్ కి వస్తే ఒక ఫ్యామిలీ మెంబర్ లా, అలాగే నా కెరీర్లో కూడా చాలా సపోర్ట్ చేస్తారు నాగార్జున అని తెలిపారు. నాగార్జున గురించి, ఆయన చేసిన సినిమాల గురించి కొద్దిసేపు పొగిడారు కార్తీ. ఆ తర్వాత ‘కన్నుల్లో నీ రూపమే..” అనే నాగార్జున సాంగ్ ని కూడా పాడి అలరించారు కార్తీ. అలాగే సినిమా గురించి, ఇందులో తాను వేసిన గెటప్స్ గురించి, చిత్ర యూనిట్ గురించి చెప్పారు. ఈవెంట్ లో చాలా సరదాగా మాట్లాడారు కార్తీ.

Siva Karthikeyan : సౌత్ సినిమాల సక్సెస్ పై స్పందించిన శివ కార్తికేయన్.. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి..

ఇక అభిమానులు సూర్య రోలెక్స్, కార్తీ ఢిల్లీ క్యారెక్టర్స్ గురించి అడగటంతో కార్తీ సమాధానమిస్తూ.. అది డైరెక్టర్ లోకేష్ ని అడగాలి. కానీ ఖైదీ అయితే కచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. అందులో రోలెక్స్ ఉన్నాడా లేదా అనేది లోకేష్ కి తెలియాలి అని చెప్పారు.