Siva Karthikeyan : సౌత్ సినిమాల సక్సెస్ పై స్పందించిన శివ కార్తికేయన్.. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి..

సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ''ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, ద్విభాషా సినిమాలు వస్తున్నాయి. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి గారి సినిమా, శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. ప్రిన్స్ నా మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా. భవిష్యత్తులో......................

Siva Karthikeyan : సౌత్ సినిమాల సక్సెస్ పై స్పందించిన శివ కార్తికేయన్.. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలి..

Siva Karthikeyan comments on south movies

Siva Karthikeyan :  తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా, యుక్రెయిన్ నటి మరియా హీరోయిన్ గా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ప్రిన్స్. ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. దీపావళి కానుకగా ఈ నెల 21న ప్రిన్స్ సినిమా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా శివ కార్తికేయన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

శివ కార్తికేయన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ”నేను, హీరో నాని గారు ఒకేలా ఉంటారని కొంతమంది అంటూ ఉంటారు. నాని గారు కూడా యాంకర్ గా, ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి, చాలా కష్టపడి హీరోగా ఎదిగారు. నేను కూడా టీవీల్లో, ఈవెంట్స్ లో యాంకర్ గా పనిచేస్తూ నా కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పుడు ఇలా సినిమాల్లో ఉన్నాను అన్నారు.”

BiggBoss 6 Day 45 : బిగ్‌బాస్‌లో దొంగలు పడ్డారు.. బిగ్‌బాస్ కోపానికి ఆకలితో అలమటించిన కంటెస్టెంట్స్

అలాగే సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. ”ఇటీవల పాన్ ఇండియా సినిమాలు, ద్విభాషా సినిమాలు వస్తున్నాయి. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి గారి సినిమా, శంకర్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నారు. ప్రిన్స్ నా మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా. భవిష్యత్తులో నేను మరిన్ని ద్విభాషా చిత్రాలు చేయాలనుకుంటున్నాను. ఇటీవల సౌత్ సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధిస్తున్నాయి. KGF, RRR, విక్రమ్, కాంతార.. ఇలా చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. తెలుగు, తమిళ్ వాళ్ళు కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు శివ కార్తికేయన్.