సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథానిక.. ఏప్రిల్ 23న విడుదల

10TV Telugu News

Kathanika Movie: థాంక్యూ ఇంఫ్రా టాకీస్ పతాకంపై మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా హీరో హీరోయిన్లుగా రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ నటీనటులుగా.. జగదీష్ దుగన దర్శకత్వంలో శ్రీమతి పద్మ లెంక నిర్మిస్తున్న సినిమా “కథానిక”. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 23వ తేదీన విడుదలకు సిద్ధం అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. మంచి గ్రిప్పింగ్ కథ కథనంతో ఊహకందని మలుపులతో ఉంటుందని చిత్ర దర్శకులు జగదీష్ దుగన వెల్లడించారు.

ఈ సినిమా ఏప్రిల్ 23వ తేదీన థియేటర్లలోకి రానుందని, సస్పెన్స్ కథలు ఎక్కువగా నచ్చేవారికి సినిమా బాగా నచ్చుతుందని నిర్మాత శ్రీమతి పద్మ లెంక చెప్పుకొచ్చారు. థాంక్యూ ఇంఫ్రా టాకీస్‌పై తెరకెక్కిన ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని, సినిమా కచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత. సంగీతం, కథ, కథనం సినిమాలో హైలైట్‌గా ఉన్నట్లు నిర్మాత చెప్పారు.

మనోజ్ నందన్, నైనీషా, సాగర్, సరితా పాండా, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బి హెచ్ ఈ ఎల్ ప్రసాద్, బొంబాయి పద్మ, కేర్ అఫ్ కంచరపాలెం ఫేమ్ ఉమా మహేశ్వర రావు, అల్లు రమేష్, నల్లా సీను, బేబీ సంజన, కార్తిక్, తదితరులు ఇందులో ముఖ్యపాత్రల్లో నటించారు.