సుధామూర్తి కాళ్లకు నమస్కరించిన అమితాబ్

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 11వ సీజ‌న్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ సుధా మూర్తి కాళ్లకు అమితాబ్ బ‌చ్చ‌న్ నమస్కరించారు..

  • Published By: sekhar ,Published On : November 30, 2019 / 09:34 AM IST
సుధామూర్తి కాళ్లకు నమస్కరించిన అమితాబ్

Updated On : November 30, 2019 / 9:34 AM IST

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 11వ సీజ‌న్‌లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ సుధా మూర్తి కాళ్లకు అమితాబ్ బ‌చ్చ‌న్ నమస్కరించారు..

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్, ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ సుధా మూర్తి కాళ్లకు నమస్కరించారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం దేశంలో అత్యంత రేటింగ్ సంపాదించుకున్న రియాలిటీ షోగా పేరొందింది. 19 ఏళ్ల కేబీసీ ప్రయాణంలో ఇప్పటికి 11 సీజన్లు పూర్తయ్యాయి. 10 సీజన్లకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరించారు.

Image result for amitabh bachchan sudhamurty

కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి 11వ సీజ‌న్‌లో భాగంగా జ‌రిగిన చివ‌రి ఎపిసోడ్‌లో సుధా మూర్తి పాల్గొన్నారు. ఆమె నేప‌థ్యం గురించి మాట్లాడుతూ.. వంద‌ల స్కూళ్లు, 60 వేల లైబ్ర‌రీలు, 16 వేల‌కు పైగా టాయిలెట్స్ క‌ట్టించినట్టు తెలిపారు. సుధామూర్తి నేపథ్యం గురించి విన్న తర్వాత త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌దైనా సుధామూర్తి కాళ్ల‌కు అమితాబ్ న‌మ‌స్క‌రించారు.

Related image
ఈ సంద‌ర్భంగా ఆమె తాను చ‌దువుకున్న కాలేజీలో టాయిలెట్ లేద‌ని, అందుక‌నే ఇన్ఫోసిస్ ఫౌండేష‌న్ త‌ర‌పున టాయిలెట్స్ క‌ట్టించామని తెలిపారు. దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌ను రూపుమాపేందుకు త‌మ ఫౌండేష‌న్ త‌ర‌పున ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని చెప్పారు. కాగా అమితాబ్, సుధామూర్తి కాళ్లకు నమస్కరించిన వార్త వైరల్ అవుతోంది. 

Image result for amitabh bachchan sudhamurty