Prabhas: ప్రభాస్ ముందు ఖాన్లు, కపూర్లు, స్టార్లంతా చిన్నవాళ్ళేనా!

బాహుబలి ఫ్రాంచైజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకుని సినిమాకి 100 కోట్లు అందుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ రేట్ ని ఓ రేంజ్ లోపెంచేశారు. నిజానికి ప్రభాస్ తో సినిమా..

10TV Telugu News

Prabhas: బాహుబలి ఫ్రాంచైజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ సంపాదించుకుని సినిమాకి 100 కోట్లు అందుకుంటున్న ప్రభాస్.. ఇప్పుడు ఆ రేట్ ని ఓ రేంజ్ లోపెంచేశారు. నిజానికి ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తే సగం బడ్జెట్.. ఈ స్టార్ హీరో రెమ్యూనరేషన్ కే స్పెండ్ చేస్తున్నారు మేకర్స్. ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందకుంటూ ఇండియాలోనే హయ్యస్ట్ పెయిడ్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఒక్కో సినిమాకి ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు..?

Bhumi Pednekar: అందాలతో భూమి రచ్చ.. మతులు పోగొడుతుందిగా!

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రెమ్యూరేషన్ ముందు ఖాన్లు, కపూర్లు, స్టార్లు.. వీళ్లందరూ ఇప్పుడు చాలా చిన్నవాళ్లు. పాన్ ఇండియా స్టార్ డమ్ తో పాటు రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో తీసుకుంటున్న ప్రభాస్.. 150 కోట్లతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పటి వరకూ సౌత్ లో రజనీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే 100 కోట్ల మార్క్ వరకూ వచ్చారు. ప్రభాస్ మాత్రం వాళ్లందర్నీ మించి టాలీవుడ్ నుంచి ఇండియాలోనే 150 కోట్ల టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా కొత్త రికార్డ్ సెట్ చేశారు.

Samantha: కుక్కకు సమంత బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

ఎవరైనా ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేస్తే.. సగం బడ్జెట్ ప్రభాస్ రెమ్యూనరేషన్ కే స్పెండ్ చెయ్యాలన్న మాట. ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు ప్రభాస్. ఇప్పటికే 100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్.. తన అప్ కమింగ్ మూవీస్ అన్నిటికీ 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తో ఆదిపురుష్ సినిమాని కంప్లీట్ చేసిన ప్రభాస్.. తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేశారు.

Drushyam 2 Telugu: అమెజాన్‌లో వచ్చేసిన వెంకీ మరో దృశ్యం!

నెక్ట్స్ ఇయర్ ఆగస్ట్ కి రిలీజ్ అవుతున్న ఆదిపురుష్ ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం సలార్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సలార్ తో పాటు నాగాశ్విన్ తో 300 కోట్లతో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె ను కూడా లైన్లో పెట్టారు ప్రభాస్. దీపికా పడుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రాజెక్ట్ కె కోసం ఇప్పటికే 200 రోజుల కాల్షీట్స్ ఇచ్చారు ప్రభాస్. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు యూనిట్.