Love Today : ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడే..

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తమిళనాట అదిరిపోయే హిట్టుని అందుకున్న చిత్రం 'లవ్ టుడే'. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రదీప్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ ఈ మూవీ రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని...

Love Today : ఓటిటిలోకి ఎంట్రీ ఇస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ లవ్ టుడే..

Love Today is ready to OTT release

Love Today : యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తమిళనాట అదిరిపోయే హిట్టుని అందుకున్న చిత్రం ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రదీప్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు. రాధికా శరత్‌కుమార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో పోషించగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ప్రేమకుల మధ్య జరిగే చిన్న చిన్న అంశాలను తీసుకుని నాచురాలిటీకి దగ్గరగా తెరకెక్కించిన దర్శకుడు మేకింగ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Brahmanandam : మళ్ళీ తాత అయిన బ్రహ్మానందం..

ఇక టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను సొంతం చేసుకొని, ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. తెలుగులో కూడా ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు మొదటి రోజే 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి.. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్ ఈ మూవీ రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2న ‘లవ్ టుడే’ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ లో అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. థియేటర్ లో విడుదలైన వారానికే ఓటిటిలోకి వస్తుండడంతో అభిమానులు ఈ సినిమాను మరోమారు చూసేయడానికి సిద్ధమవుతున్నారు.