Manchu Lakshmi : బాలీవుడ్ లో బిజీ కాబోతున్న మంచు లక్ష్మి.. ముంబైకి షిఫ్ట్..

ఇన్నాళ్లు తెలుగులో అలరించిన మంచు లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ కాబోతుంది. గత కొన్నాళ్ల నుంచి మంచు లక్ష్మి ముంబైలోనే ఉంటుంది.

Manchu Lakshmi : బాలీవుడ్ లో బిజీ కాబోతున్న మంచు లక్ష్మి.. ముంబైకి షిఫ్ట్..

Manchu Lakshmi shifted to Mumbai Ready to Busy in Bollywood

Updated On : October 13, 2023 / 9:12 AM IST

Manchu Lakshmi : మంచు లక్ష్మి తెలుగులో పలు సినిమాలతో, సిరీస్ లతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తెలుగులో పలు సినిమాలు చేస్తూ, యూట్యూబ్ లో వీడియోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. ఇక తన మాటలతో, స్పీచ్ లతో బాగా వైరల్ అయి ట్రోల్ అయినా మంచు లక్ష్మి అవన్నీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. త్వరలోనే తెలుగులో ఆదిపర్వం, అగ్ని నక్షత్రం అనే సినిమాలతో రాబోతుంది మంచు లక్ష్మి.

అయితే ఇన్నాళ్లు తెలుగులో అలరించిన మంచు లక్ష్మి ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ కాబోతుంది. గత కొన్నాళ్ల నుంచి మంచు లక్ష్మి ముంబైలోనే ఉంటుంది. అప్పుడప్పుడు బాలీవుడ్ భామలతో కలిసి ముంబైలో జిమ్‌ల దగ్గర, పార్టీలలో కనిపిస్తుంది. తాజాగా ఓ బాలీవుడ్ న్యూస్ సైట్ మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అయింది, బాలీవుడ్ లో కొన్ని సినిమాలు, సిరీస్ లు చేయబోతున్నట్టు ట్వీట్ చేశారు.

Also Read : Neethone Nenu : నీతోనే నేను మూవీ రివ్యూ.. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో టీచర్ల గురించి గొప్పగా..

మంచు లక్ష్మి ఆ ట్వీట్ ని రీషేర్ చేస్తూ.. కొత్త సిటీ, కొత్త జీవితం.. లైఫ్ కి ఎంతో రుణపడి ఉంటాను. నా ఫ్యాన్స్, నా సపోర్టర్స్, నన్ను నమ్మేవాళ్ళందరికి థ్యాంక్స్ అని పోస్ట్ చేసింది. దీంతో మంచు లక్ష్మి ముంబైకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో పలు సిరీస్ లలో అవకాశాలు వచ్చినట్టు సమాచారం. బాలీవుడ్ లో కూడా వరుసగా ప్రాజెక్ట్స్ చేయాలని మంచు లక్ష్మి అక్కడికి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.