Ginna Trailer: జిన్నా ట్రైలర్.. కామెడీతో నవ్వించిన మంచు విష్ణు!

యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Ginna Trailer: జిన్నా ట్రైలర్.. కామెడీతో నవ్వించిన మంచు విష్ణు!

Manchu Vishnu Ginna Trailer Filled With Laughs

Ginna Trailer: యంగ్ హీరో మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను తొలుత దసరా కానుకగా రిలీజ్ చేయాలని చూసినా, కొన్ని కారణాల వల్ల దీన్ని వాయిదా వేశారు. ఇక ఈ సినిమాలో హాట్ బ్యూటీలు సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

Ginna Trailer: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన జిన్నా

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జిన్నా చిత్ర ట్రైలర్ ఆద్యంతం కామెడీ అంశాలతో ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో మంచు విష్ణు హ్యాండ్‌సమ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్, ఈ అంచనాలను రెట్టింపు చేసింది.

Ginna Movie: జిన్నా రిలీజ్‌పై విష్ణు క్లారిటీ.. ఎప్పుడు వస్తున్నాడంటే..?

కామెడీ కథకు కాస్త హార్రర్‌ను జోడించి ఈ సినిమాను దర్శకుడు ఇషాన్ సూర్య తెరకెక్కించినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక చమ్మక్ చంద్ర, వెన్నెల కిషోర్ వంటి కమెడియన్స్ ఈ సినిమాలో చాలా మంది ఉన్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను మంచు విష్ణు AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ‘జిన్నా’ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.