Megastar Chiranjeevi : వాల్తేరు వీరయ్యగా మాస్ లుక్‌లో మెగాస్టార్.. బాంబ్ బ్లాస్ట్‌లా పేలిన టైటిల్ టీజర్..

ఈ సినిమాకి పలు టైటిల్స్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చినా దీపావళి నాడు అధికారికంగా టైటిల్ ని ప్రకటిస్తారని తెలిపారు చిత్ర యూనిట్. నేడు దీపావళి నాడు చిరంజీవి 154వ సినిమా టైటిల్ ని ప్రకటించారు. అయితే ముందుగా అందరూ అనుకున్న టైటిల్............

Megastar Chiranjeevi : వాల్తేరు వీరయ్యగా మాస్ లుక్‌లో మెగాస్టార్.. బాంబ్ బ్లాస్ట్‌లా పేలిన టైటిల్ టీజర్..

Megastar Chiranjeevi 154th movie titled as waltair veerayya and glinps relkeased

Updated On : October 24, 2022 / 11:32 AM IST

Megastar Chiranjeevi :  చిరంజీవి హీరోగా, రవితేజ ముఖ్యపాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతోందని ఇప్పటికే డైరెక్టర్, చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పారు.

ఈ సినిమాకి పలు టైటిల్స్ అనుకుంటున్నట్టు వార్తలు వచ్చినా దీపావళి నాడు అధికారికంగా టైటిల్ ని ప్రకటిస్తారని తెలిపారు చిత్ర యూనిట్. నేడు దీపావళి నాడు చిరంజీవి 154వ సినిమా టైటిల్ ని ప్రకటించారు. అయితే ముందుగా అందరూ అనుకున్న టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’నే ప్రకటించారు. కేవలం టైటిల్ మాత్రమే కాకుండా చిన్న గ్లింప్స్ కూడా వదిలారు.

Vikram : చియాన్ 61.. పల్లెటూరి వ్యక్తిగా విక్రమ్ ‘తంగలాన్’.. గ్లింప్స్ రిలీజ్..

గ్లింప్స్ లో చిరంజీవి ఫుల్ మాస్ లుక్ లో అదరగొట్టారు. బీడీ కాల్చుతూ ఒక బాంబ్ పేలిస్తే విలన్స్ ఎగిరిపడ్డట్టు, చివర్లో ఇలాంటి ధమాకా ఎంటర్టైన్మెంట్స్ కావాలంటే లైక్, షేర్, సబ్ స్క్రయిబ్ అని చిరంజీవి డైలాగ్ చెప్పారు. వాల్తేరు వీరయ్య అంటూ టైటిల్ ని గ్రాండ్ గా వేశారు. ఈ టైటిల్ టీజర్ చూస్తుంటే ఇది పక్కా ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా అని, వైజాగ్ లో సముద్రం దగ్గర జరిగే స్టోరీ అని తెలుస్తోంది. టీజర్ తోనే మెగా అభిమానులకి పూనకాలు తెప్పించాడు దర్శకుడు బాబీ. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ టైటిల్ టీజర్ చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపనున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో సంక్రాంతికి ఈ సారి థియేటర్స్ దద్దరిల్లిపోతాయని అర్థమైపోతుంది.