Chiranjeevi Birthday Special : మెగాస్టార్ ఎన్నో సూపర్ హిట్స్ ఉండగా.. ఘరానా మొగుడు సినిమానే రీరిలీజ్ ఎందుకు..?

మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక జోష్ వస్తుంది. మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి థియేటర్ దగ్గర ఒక ఉత్సవమే జరుగుతుంది. ఇటీవల కొన్ని సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్చి.................

Chiranjeevi Birthday Special : మెగాస్టార్ ఎన్నో సూపర్ హిట్స్ ఉండగా.. ఘరానా మొగుడు సినిమానే రీరిలీజ్ ఎందుకు..?

ghjarana mogudu

Chiranjeevi Birthday Special :  మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు వింటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలకి ఒక జోష్ వస్తుంది. మెగాస్టార్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి థియేటర్ దగ్గర ఒక ఉత్సవమే జరుగుతుంది. ఇటీవల కొన్ని సినిమాలని ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా మార్చి కొత్తగా 4K వర్షన్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజున చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే చిరంజీవి కెరీర్ లో ఖైదీ, యముడికి మొగుడు, రౌడీ అల్లుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్.. లాంటి ఎన్నో హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉండగా ఘరానా మొగుడు సినిమానే ఎందుకు రీ రిలీజ్ చేస్తున్నారు అని చాలా మంది మదిలో ఈ ప్రశ్న మెదులుతుంది.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నగ్మా హీరోయిన్ గా వాణి విశ్వనాథ్ ముఖ్య పాత్రలో, డిస్కో శాంతి స్పెషల్ సాంగ్ తో రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, చలపతిరావు, శరత్ సక్సేనా, రమాప్రభ, శుభ, ఆహుతి ప్రసాద్, సాక్షి రంగారావు పలువురు ప్రముఖులు నటించగా దేవీ ఫిలిమ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీవరప్రసాద్ నిర్మించిన ఘరానా మొగుడు సినిమా 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.

ఈ సినిమాతో పాటు, ఈ సినిమా కంటే ఎన్నో హిట్ సినిమాలు ఉన్నా ఈ సినిమానే రిలీజ్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాలీవుడ్ లో మొట్టమొదటి సారిగా 10 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ‘ఘరానా మొగుడు’. అప్పటివరకు తెలుగు పరిశ్రమలో 10 కోట్ల కలెక్షన్ లేదు. ఈ సినిమాతో 10 కోట్లు కలెక్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రికార్డ్ సృష్టించారు.

Celebrity Cricket Carnival : సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ని లాంచ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

ఇక ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత చిరంజీవి మొదటి సారిగా కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇండియాలో అమితాబ్ తర్వాత, సౌత్ లో మొట్టమొదటిసారి కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరో చిరంజీవే. అది ఘరానా మొగుడు వల్లే సాధ్యమైంది.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 1990లో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, 1991లో ‘రౌడీ అల్లుడు’, 1992లో ‘ఘరానా మొగుడు’ సినిమాలు రాగా మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయి వీళ్ళ కాంబినేషన్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా రిలీజై ఇటీవలే 30 సంవత్సరాలు పూర్తి అయింది.

gharana mogudu records

 

‘ఘరానా మొగుడు’ సినిమా 56 కేంద్రాలలో వంద రోజులు, మూడు కేంద్రాలలో 175 రోజులు, హైదరాబాద్ సంధ్య 70 ఎమ్.ఎమ్.లో ఏకధాటిగా 183 రోజులు ఆడి అప్పటివరకు ఉన్న రికార్డులని తుడిచిపెట్టేసింది.

ఘరానా మొగుడు సినిమా తర్వాత బాలీవుడ్ లోను చిరంజీవి అంటే తెలిసింది. అప్పటికే చిరంజీవి అక్కడ పరిచయం ఉన్నా ఈ సినిమా భారీ విజయం సాధించడంతో అమితాబ్ కంటే కూడా గ్రేట్ యాక్టర్ అంటూ బాలీవుడ్ పత్రికలు, మ్యాగజైన్స్ స్పెషల్ ఆర్టికల్స్ రాశాయి చిరంజీవి మీద. దీంతో ఈ సినిమా మెగాస్టార్ కి చాలా స్పెషల్ గా మారింది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండియాలో కూడా స్క్రీనింగ్ అయింది. ఆ తర్వాత మలయాళంలో డబ్బింగ్ అయి అక్కడ కూడా 175 రోజులు ఆడింది ఈ సినిమా.

Chiranjeevi : చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం ఆస్పత్రిని నిర్మిస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన

ఇక ఇందులో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బంగారు కోడిపెట్ట సాంగ్ ఓ సెన్సేషన్. ఆ సాంగ్ అప్పట్లో తెలుగు ప్రజలని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికి ఆ పాత వింటే ఫుల్ జోష్ వస్తుంది. ఇక ఈ సినిమాలోని కామెడీ టైమింగ్స్, మాస్ డైలాగ్స్ ప్రేక్షకులని సీట్లలో కూర్చోనివ్వలేదు. సినిమా చూస్తున్నంత సేపు థియేటర్లో విజిల్స్, అరుపులే. మాస్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవ్వడంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. చిరంజీవి కెరీర్ లో ఎన్ని హిట్లు ఉన్నా 30 ఏళ్ళ క్రితం వచ్చిన ఘరానా మొగుడు చిరంజీవికి ఎంతో స్టార్ డం, దేశ వ్యాప్తంగా ఎంతో పేరు, డబ్బులు తెచ్చిపెట్టింది. అందుకే ఈ బర్త్ డేకి చిరంజీవి నటించిన సినిమాల్లో ఘరానా మొగుడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

ghjarana mogudu

 

అసలు ఈ సినిమా మాసిజం గురించి తెలియాలంటే మన పేరెంట్స్ ని, అప్పటి చిరంజీవి ఫ్యాన్స్ ని అడగాలి. మన చుట్టాల్లో, మనకి తెలిసిన పెద్ద వాళ్లలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ ని అడిగితే అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామి గురించి చెప్తారు. మనం ఇప్పుడు మన హీరోల రిలీజ్ డేకి చేసిన రచ్చ కంటే ఎక్కువగా అప్పట్లో వాళ్ళు ఈ సినిమాకి 50 రోజుల తర్వాత కూడా అదే రచ్చ చేశారంటే ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అర్ధమవుతుంది.