Mem Famous Teaser : ‘మేమ్ ఫేమస్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.. ఫేమస్ అవ్వాలంటే కొట్టాల్సిందే!

షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) "మేమ్ ఫేమస్" (Mem Famous) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ ని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) రిలీజ్ చేశాడు.

Mem Famous Teaser : ‘మేమ్ ఫేమస్’ టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి.. ఫేమస్ అవ్వాలంటే కొట్టాల్సిందే!

Mem Famous Teaser released by Minister Mallareddy

Updated On : March 26, 2023 / 12:27 PM IST

Mem Famous Teaser : ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ అంతా ఫ్రెష్ కంటెంట్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ ముందుగా ఆకట్టుకొని, ఆ తరువాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలు కల్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) అనే కుర్రాడు యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. తానే నటుడిగా, రైటర్‌గా, డైరెక్టర్‌గా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తాజాగా వెండితెర పై తన మొదటి సినిమాని రిలీజ్ కి సిద్ధం చేశాడు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్‌లో పవన్‌కి విలన్‌గా మంత్రి మల్లారెడ్డి.. బ్రతిమాలిన హరీష్ శంకర్!

మేమ్ ఫేమస్ (Mem Famous) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీకి రైటర్‌గా, డైరెక్టర్‌గా సుమంత్ వర్క్ చేస్తూనే హీరోగా కూడా నటించాడు. ఈ మూవీ టీజర్ ని ఇవాళ (మార్చి 26) మంత్రి మల్లారెడ్డి (Mallareddy) లాంచ్ చేశాడు. ఇక టీజర్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నడించింది. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు కుర్రాళ్లు పనిపాట లేకుండా రోజు మందు తాగుతూ జల్సా చేస్తూ తిరుగుతుంటారు. ఇక ఎవడిని అయిన కొడితే చాలు ఊరిలో ఫేమస్ అయిపోతాం అని అనుకుంటుంటారు. క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్ మాత్రం టీజర్ లో రివీల్ చేశారు. సినిమా కథ ఏంటనేది ట్రైలర్ లో చూపిస్తారు ఏమో చూడాలి.

Tollywood Heros as Lord Rama : రాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు వీరే..

ఇక టీజర్ రిలీజ్ చేసిన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘యువత గాలికి తిరగడం మానేసి కష్ట పడండి. మీ ఏజ్ లో నేను కష్ట నేడు ఈ పొజిషన్ కి వచ్చాను’ అని వ్యాఖ్యానించాడు. కాగా అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్ చూస్తుంటే నిర్మాణ విలువలు బాగున్నాయి. కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నాడు. మని ఎగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాశి, కిరణ్ మచ్చా, అంజి మామ, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, శివ నందన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.