Tollywood Heros as Lord Rama : రాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు వీరే..

మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడినే చూపిస్తాం. మరి అలంటి పాత్రని టాలీవుడ్ లో ఏ ఏ నటులు వెండితెర పై పోషించారో తెలుసా?

Tollywood Heros as Lord Rama : రాముడి పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోలు వీరే..

Tollywood Heroes list who played lord rama role

Tollywood Heros as Lord Rama : భారతీయ ఇతిహాసాల్లో శ్రీ రాముడుకి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి, రాజు ఎలా పాలించాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకుగా, అన్నగా.. ఇలా మన జీవితాల్లో ఏ పాత్ర తీసుకున్నా దానికి ఆదర్శంగా శ్రీ రాముడిని చూపిస్తాము. ఇక ఈ నెల 30వ తారీఖున శ్రీ రామనవమి పండుగ ఉన్న సంగతి తెలిసిందే. మరి రాముడి వంటి గొప్ప పాత్రని ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో ఏ ఏ నటులు పోషించారు ఒకసారి చూసేదం.

Manchu Manoj : నిజం కోసం పోరాడి చావడానికైనా సిద్ధం.. మంచు మనోజ్ సంచలన పోస్ట్!

తెలుగు వాడికి శ్రీ రాముడు అన్నా, శ్రీ కృష్ణుడు అన్నా మొదటిగా గుర్తుకు వచ్చేది ‘సీనియర్ ఎన్టీఆర్’ (NTR). తన హుందాతనంతో, తన రాజసంతో రాముడు అంటే ఇలానే ఉంటాడు ఏమో అనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రని పోషించారు. అప్పుడే కాదు, ఇప్పటికి కొంతమంది తమ ఇళ్లలో రాముడి ఫోటోగా ఎన్టీఆర్ ఫోటోనే పెట్టుకొని ఆరాధిస్తారు. శ్రీ రామ పట్టాభిషేకం, లవకుశ వంటి సినిమాల్లో పూర్తి స్థాయి రాముడి పాత్రతో పాటు పలు సినిమాల్లో కొంతసేపు రాముడిగా కనిపించి అలరించారు.

ఇక సీనియర్ ఎన్టీఆర్ తరువాత రాముడిగా అందరి మనసు దోచుకున్న సోగాడు ‘శోభన్ బాబు’ (Sobhan Babu). తన అందంతో ఒకప్పుడు ఆడపిల్లలకు కలల రాకుమారుడిగా ఉన్న శోభన్ బాబు.. సంపూర్ణ రామాయణం సినిమాలో రాముడిగా కనిపించారు. ఆ మూవీలో సీతగా చంద్రకళ నటించారు.

M M Keeravani : RGV నా మొదటి ఆస్కార్ అంటున్న కీరవాణి.. చచ్చిన వాళ్లనే ఇలా పొగుడుతారు అంటున్న వర్మ!

వీరిద్దరి తరువాత రాముడి పాత్రకి న్యాయం చేసింది హీరో ‘సుమన్’ (Suman). కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన శ్రీరామదాసు సినిమాలో రాముడి పాత్ర కోసం సుమన్ తీసుకున్నారు. ప్రేక్షకులు కూడా సుమన్ రాముడిగా అంగీకరించడంతో.. ఎన్టీఆర్, శోభన్ బాబు తరువాత రాముడి పాత్రలో మరొకర్ని ఉహించుకోలేని ఎంతోమంది మూవీ మేకర్స్ కి సుమన్ బెస్ట్ ఛాయస్ అయ్యాడు.

ఆ తరువాత బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) రాముడి పాత్రలో కనిపించి సీనియర్ ఎన్టీఆర్ ని తలపించాడు. లవకుశ సినిమా కథతో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతగా నటించగా, శ్రీకాంత్ (Srikanth) లక్ష్మణుడు పాత్రలో కనిపించాడు.

CCL 2023 : క్రికెట్ అయినా సినిమా అయినా డామినేషన్ మనదే.. తెలుగు వారియర్స్ విక్టరీ!

ఇక మరో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడి పాత్రలో నటించాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ ని రాముడి పాత్రతోనే మొదలు పెట్టాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బలరామాయణం సినిమాలో ఎన్టీఆర్ రాముడి పాత్రని పోషించాడు. ఈ సినిమా నేషనల్ అవార్డుని కూడా అందుకుంది.

అలాగే హీరో శ్రీకాంత, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవుళ్ళు సినిమాలో కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రని పోషిస్తున్నాడు. సీతగా కృతిసనన్ నటిస్తుంది. ఈ శ్రీ రామనవమికి ఈ మూవీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.