Unstoppable episode 4 : అజహరుద్దీన్ ఇండియా టీమ్‌కి సెలెక్ట్ అయ్యాక మా ఇంటికి సైకిల్ మీద వచ్చి.. కిరణ్ కుమార్ రెడ్డి!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, ఇండియన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేశాడు.

Mohammad Azharuddin made three centuries with Kiran Kumar reddy cricket kit
Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.
Unstoppable episode 4 : నేను బ్రతికున్నా కాబట్టి సీఎం అయ్యా.. కిరణ్ కుమార్ రెడ్డి!
ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, ఇండియన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేశాడు. కాలేజీ సమయంలో అజర్, కిరణ్ కుమార్ కెప్టెన్సీలో అండర్-19 వంటి ఎన్నో మ్యాచ్ లు అడిడాడు అంటా.
ఆ తరువాతి కాలంలో కిరణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా, అజహరుద్దీన్ ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. 1984లో ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ కి అజర్ సెలెక్ట్ అయ్యాక కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి సైకిల్ మీద వచ్చి.. కిరణ్ కుమార్ క్రికెట్ కిట్ ని తీసుకోని వెళ్ళాడట. ‘ఆ బ్యాట్‌తోనే అజహరుద్దీన్ మూడు సెంచరీలు చేసినట్లు’ ఈ షోలో చెప్పుకొచ్చాడు.