Naga Shaurya: నాగశౌర్య ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ హిట్ అందుకునేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.

Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి తనదైన మార్క్ హిట్ అందుకునేందుకు నాగశౌర్య రెడీ అవుతున్నాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి.
Naga Shaurya: ఫిబ్రవరి 6న ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ నుండి అనౌన్స్‌మెంట్.. అదేనా..?
కాగా, తాజాగా ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతుందని ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ టీజర్‌లో ఆద్యంతం నాగశౌర్య, మాళవికా నాయర్‌ల మధ్య కెమిస్ట్రీని మనకు చూపెట్టారు. ఇక దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరోసారి ఈ సినిమాతో తనమార్క్ ఎంటర్‌టైనర్‌ని ప్రేక్షకులకు అందించడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ తాజాగా ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను మార్చి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మార్చి 17 వరకు వెయిట్ చేయాల్సిందే.