Nagarjuna : ఘోస్ట్ సినిమా హిట్ అయితే దానికి ప్రీక్వెల్ ఉంటుంది..

సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ లో నాగార్జున వెపన్ గా ఓ కత్తిని వాడినట్టు చూపించారు. చాలా స్టైలిష్ గా ఆ కత్తితో నాగార్జున విన్యాసాలు చేసినట్టు, యాక్షన్ సీన్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ కత్తి..........

Nagarjuna : ఘోస్ట్ సినిమా హిట్ అయితే దానికి ప్రీక్వెల్ ఉంటుంది..

Nagarjuna says there is a prequel for the Ghost Movie

Nagarjuna :  నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరెక్కిన సినిమా ది ఘోస్ట్. దసరా కానుకగా ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా నేడు అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. రిలీజ్ కి ముందు నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియచేశాడు.

ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ లో నాగార్జున వెపన్ గా ఓ కత్తిని వాడినట్టు చూపించారు. చాలా స్టైలిష్ గా ఆ కత్తితో నాగార్జున విన్యాసాలు చేసినట్టు, యాక్షన్ సీన్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ కత్తి తమహాగనే అనే పదార్థంతో తయారు చేయబడింది. ఇది స్పెషల్ గా జపాన్ లో మాత్రమే దొరుగుతుంది. తమహగనే లోహంతో తయారు చేసిన కత్తులకి ఎక్కువ విలువ ఉంటుంది. నాగార్జున ఈ కత్తి వాడటంతో దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంతా.

Nagababu : పవన్ కి మేలు జరగాలనే అన్నయ్య రాజకీయాలకి దూరంగా ఉన్నారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

నాగార్జున ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తమహగనే కత్తి గురించి మాట్లాడుతూ.. ”తమహగనే వెనుక ఒక బ్యాక్ స్టొరీ ఉంది. ఈ సినిమాలో అది చూపించలేదు. తమహగనే వెపన్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ చెప్పాడు దర్శకుడు ప్రవీణ్. అది చాలా బాగుంది. ఘోస్ట్ సినిమా విజయం సాధిస్తే కచ్చితంగా తమహగనే బ్యాక్ స్టొరీని చూపిస్తూ దీనికి ప్రీక్వెల్ తీస్తాం” అని అన్నారు. దీంతో ఆ కత్తి అంత స్పెషల్ ఏంటబ్బా అని గూగుల్ చేసేస్తున్నారు. ఈ సినిమాలో తమహాగనే అంటూ ఓ పాట కూడా పెట్టడం విశేషం.