Nagababu : పవన్ కి మేలు జరగాలనే అన్నయ్య రాజకీయాలకి దూరంగా ఉన్నారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ''అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులని గెలుచుకున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మేలు జరుగుతుంది అని.............

Nagababu :  పవన్ కి మేలు జరగాలనే అన్నయ్య రాజకీయాలకి దూరంగా ఉన్నారు.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు..

 

Nagababu :  మెగాస్టార్ చిరంజీవి దసరాకి గాడ్ ఫాదర్ గా రానున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు చిరంజీవి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఈ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై, జనసేనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రెస్ మీట్ లో చిరంజీవి మాట్లాడుతూ.. ”పవన్ నిబద్దత గురించి నాకు తెలుసు. అలాంటి వాడు రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు కలుగుతుంది. పవన్ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని నేను కూడా కోరుకుంటున్నాను. జనసేనకు భవిష్యత్తులో మద్దతు ఇవ్వొచ్చేమో. నేను పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటేనే పవన్ కి మంచి జరుగుతుంది. భవిష్యత్తులో తమ్ముడు పవన్ ప్రజలని పాలించొచ్చు కూడా” అని అన్నారు.

Chiranjeevi : జనసేనకు భవిష్యత్తులో నా మద్దతు.. పవన్ రాజకీయాల్లో ఉంటే ప్రజలకి మేలు..

దీంతో చిరంజీవి జనసేనకు ప్రత్యక్షంగానే మద్దతు ప్రకటించేశారు. చిరు చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఏపీ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై నాగబాబు కూడా స్పందించారు. నాగబాబు ప్రస్తుతం పవన్ కి తోడుగా జనసేన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ”అన్నయ్య మాటలు కోట్లాది మంది తమ్ముళ్ల మనసులని గెలుచుకున్నాయి. తమ్ముడు పవన్ కళ్యాణ్ కి మేలు జరుగుతుంది అని అన్నయ్య రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అన్నయ్య ఆశీస్సులతో పవన్ పాలనా పగ్గాలు చేపడతాడు. అన్నయ్య ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు జనసైనికులు కష్టపడతారు” అని కార్యకర్తల సమావేశంలో అన్నారు.