Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

నటుడు నరేష్ నేడు తన ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కట్ చేసి కేక్ తినిపించి వారిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వీడియోలోనే త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు........

Naresh- Pavithra : ఇక అంతా అఫీషియల్.. లిప్ కిస్‌తో నరేష్-పవిత్రా పెళ్లి ప్రకటన..

Naresh and Pavithra announce their relationship officially

Naresh- Pavithra :  టాలీవుడ్ లో ఈ సంవత్సరం బాగా వైరల్ అయిన జంట సీనియర్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు బయట కూడా చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో బాగా వైరల్ అయ్యారు. ఇక నరేష్ తన మూడో భార్యతో గొడవలు పడటం, ఇవి రోడ్డుకెక్కడం, పవిత్ర-నరేష్ కలిసి ఓ హోటల్ లో ఉన్నప్పుడు మూడో భార్య అక్కడికి రావడం.. ఈ రచ్చ అంతా సోషల్ మీడియాలో, వార్తల్లో బాగా ట్రెండ్ అయింది.

నరేష్-పవిత్రా లోకేష్ పై పలు వార్తలు, గాసిప్స్ వచ్చినా అధికారికంగా స్పందించకపోగా వీరిపై తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ గతంలో పలు యూట్యూబ్ ఛానల్స్, సైట్స్ మీద పోలీసు కేసు కూడా పెట్టారు. సోషల్ మీడియాలో అయితే వీరిపై ఓ రేంజ్ లో మీమ్స్ వచ్చాయి. కొన్ని రోజుల పాటు నరేష్-పవిత్ర ట్రేండింగ్ లోనే ఉన్నారు. తాజాగా అందరికి షాక్ ఇస్తూ వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.

Sidharth-Kiara : పెళ్లి పీటలేక్కబోతున్న బాలీవుడ్ స్టార్స్.. ఈ సారైనా పక్కానా?

నటుడు నరేష్ నేడు తన ట్విట్టర్ లో ఓ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కట్ చేసి కేక్ తినిపించి వారిద్దరూ లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ వీడియోలోనే త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. కొత్త సంవత్సరం, కొత్త బంధం, మీ అందరి ఆశీస్సులు కావాలని ఈ వీడియో పోస్ట్ చేశాడు నరేష్. నరేష్ పవిత్రకి లిప్ కిస్ ఇచ్చి మరీ వీడియో పోస్ట్ చేయడంతో దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. నరేష్ తన మూడో భార్య రమ్యకి విడాకులు ఇచ్చి ఇప్పుడు నాలుగో భార్యగా పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నారు. దీంతో మరోసారి పవిత్ర-నరేష్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.