Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ''బాహుబలి సినిమాతో ప్రభాస్, రాజమౌళి, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్, RRR సినిమాతో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చూపించారు. కార్తికేయ 2 సినిమా హిందీలో డబ్‌ అయి.............

Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

Nikhil Speech in Karthikya 2 movie 100crores Success celebartions

Karthikeya 2 :  నిఖిల్, చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చాలా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించింది. ఇక నార్త్ లో అయితే కేవలం 50 థియేటర్లలో రిలీజ్ అయి మూడు రోజులోనే 1000 కి పైగా థియేటర్లకు పెరిగి దేశ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ సాధించింది. దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం కర్నూలులో కార్తికేయ 2 సినిమా 100 కోట్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా రాగా భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Karthikeya 2 movie : కార్తికేయ 2 సినిమా వంద కోట్ల సెలబ్రేషన్స్

ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ”బాహుబలి సినిమాతో ప్రభాస్, రాజమౌళి, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, సుకుమార్, RRR సినిమాతో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి చూపించారు. కార్తికేయ 2 సినిమా హిందీలో డబ్‌ అయి, నార్త్ లో విడుదలవుతుందంటే నాకు భయమేసింది. నిఖిల్‌ ఏంటి? బాలీవుడ్‌కి వెళ్లడమేంటి? అని నేను భయపడ్డాను. నాలాగే మీరు కూడా అనుకోని ఉంటారుగా. కానీ విడుదలయ్యాక భారీ విజయం సాధించింది. హిందీ డిస్ట్రిబ్యూటర్ ఇందాకే చెప్పారు, ఇవాళ్టికి కూడా దాదాపు 1200 స్క్రీన్స్‌లో కార్తికేయ 2 సినిమా ఆడుతుంది. ఇది కార్తికేయ 2 సినిమా విజయం కాదు, తెలుగు సినిమా విజయం. మనం గర్వపడాల్సిన సమయం. మేం సినిమాని ఎక్కువగా ప్రమోట్‌ చేయలేదు. మీరే సినిమా నచ్చి ముందుకి తీసుకెళ్లారు. ఈ సినిమాని ఆదరించిన అందరికి ధన్యవాదాలు. సినిమా అంటే బాక్సాఫీసు నంబర్లు కాదు, ఓ ఎమోషన్‌. మీరు నాపై, సినిమాపై చూపిస్తున్న ఈ ప్రేమే నాకు 100 కోట్లతో సమానం. నేనే మీ మధ్యలోకి వస్తా” అంటూ జనాల మధ్యలోకి వెళ్లి మాట్లాడి, కొంతమంది ఫ్యాన్స్ కి సెల్ఫీలు ఇచ్చారు నిఖిల్.