Nithya Menen : ఆరేళ్లుగా అతను నన్ను వేధిస్తున్నాడు.. యూట్యూబర్ పై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..

నిత్యామీనన్ మాట్లాడుతూ.. ''సంతోష్ వర్కీ అనే యూట్యూబర్ ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. సినిమా రివ్యూలతో ఫేమస్ తెచ్చుకున్న సంతోష్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు.............

Nithya Menen : ఆరేళ్లుగా అతను నన్ను వేధిస్తున్నాడు.. యూట్యూబర్ పై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..

nithya menen comments on santhosh varkey

Updated On : August 8, 2022 / 8:07 AM IST

Nithya Menen :  ఎన్నో తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది మలయాళ భామ నిత్యా మీనన్. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాలలో కూడా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం కాలికి గాయం అవడంతో సినిమాలకి గ్యాప్ ఇస్తున్నాను అని తెలిపింది. ఇటీవల విజయ్ సేతుపతితో నటించిన ఓ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ప్రెస్ మీట్ లో ఓ సంచలన విషయం తెలిపింది నిత్యామీనన్.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యా మీనన్ మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను గుర్తు చేసుకుంది. నిత్యామీనన్ మాట్లాడుతూ.. ”సంతోష్ వర్కీ అనే యూట్యూబర్ ఆరేళ్లుగా నన్ను వేధిస్తున్నాడు. సినిమా రివ్యూలతో ఫేమస్ తెచ్చుకున్న సంతోష్ ని నేను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసుకొని నన్ను ఇబ్బందులకు గురి చేశాడు. సంతోష్‌ నాకు 30కి పైగా నంబర్స్‌ నుంచి కాల్స్ చేస్తూ విసిగించాడు. చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పారు. కానీ నేను అతనిని క్షమించి వదిలేశాను. అయినా సంతోష్ నన్ను చాలా రకాలుగా అన్‌ పాపులర్‌ చేశాడు. నా తల్లిదండ్రులు ఈ వ్యవహారంపై సీరియస్ అయి అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు. నా గురించి సంతోష్‌ చెప్పేవన్నీ అబద్దాలే, వాటిని ఎవరూ నమ్మొద్దు” అని తెలిపింది.

Annu Kapoor : అమీర్ ఖాన్ ఎవరో నాకు తెలీదు.. బాలీవుడ్‌లో చర్చగా మారిన అన్ను కపూర్ వ్యాఖ్యలు..

నిత్యామీనన్ ఇలా మాట్లాడిన తర్వాత సంతోష్ తాజాగా ఓ మలయాళ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించాడు.