Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..? | No Updates From Salaar For The Next Two Months

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను వరుసగా చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఆదిపురుష్....

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎదురుచూపులు తప్పవా..?

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను వరుసగా చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఫుల్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్‌ను ముగించేసుకున్న డార్లింగ్, ప్రస్తుతం కేజీయఫ్ చిత్రాల సృష్టికర్త ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమాను కూడా ప్రారంభించాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 30-35% ముగించుకుంది. దీంతో ఈ సినిమా నుండి మే నెలలో ఓ అదిరిపోయే అప్‌డేట్ రాబోతుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సలార్ చిత్రం నుండి అప్‌డేట్ వస్తుందా.. అది ఎలాంటి అప్‌డేట్ అయి ఉంటుందా అని వారు ఆతృతగా ఉన్నారు.

Salaar: వైలెన్స్.. వైలెన్స్.. సలార్‌లో కేజీఎఫ్‌ను మించి యాక్షన్!

కానీ.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పట్లో సలార్ చిత్రం నుండి ఎలాంటి అప్‌డేట్ రాబోదని తెలుస్తోంది. ఇటీవల కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించిన సలార్ టీమ్, ప్రస్తుతం షూటింగ్‌పై మాత్రమే ఫోకస్ పెట్టారని.. దీంతో మే చివరి వారంలో ఓ అప్‌డేట్ ఉంటుందనే వార్తను వారు పక్కనబెట్టినట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంటే.. ఇన్నిరోజులుగా మే చివరివారం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల ఆశలపై సలార్ టీమ్ నీళ్లు జల్లినట్లు అయ్యింది. ఇక ఈ షెడ్యూల్ షూటింగ్ ముగించుకున్నాకే.. అంటే జూన్ లేదా జూలై నెలలో సలార్ చిత్ర టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈసారి కూడా తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీతో రాబోతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ ఊరమాస్ లుక్ ఇప్పటికే రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకుల మతులు పోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, విలక్షణ నటుడు జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా నుండి టీజర్ అప్‌డేట్ కోసం ప్రేక్షకులకు ఎదురుచూపులు తప్పవా..?

×