10TV Grama Swarajyam : 10టీవీ ‘సర్పంచ్‌ల సమ్మేళనం- 2025’లో నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల మనోగతం..

తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు.. ఇటువంటి సమస్యలు గ్రామాల్లో చాలానే ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తాం.

10TV Grama Swarajyam : 10టీవీ ‘సర్పంచ్‌ల సమ్మేళనం- 2025’లో నిజామాబాద్ జిల్లా సర్పంచ్‌ల మనోగతం..

Updated On : December 28, 2025 / 5:38 PM IST

10TV Grama Swarajyam : సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి సాధకులు. గ్రామ పాలనకు సర్పంచ్ ప్రధాన నాయకుడు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్‌లది. వారిని ‘సర్పంచ్‌ల సమ్మేళనం-2025’ కార్యక్రమంతో ఒకే చోటికి తీసుకొచ్చింది 10టీవీ. రాష్ట్రం నలుమూలల నుంచి సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన పలువురు సర్పంచ్ లు 10టీవీ వేదికగా తమ గళం వినిపించారు. వారి అభిప్రాయాలను ఇక్కడి వీడియోలో చూడండి..