Salaar: వైలెన్స్.. వైలెన్స్.. సలార్‌లో కేజీఎఫ్‌ను మించి యాక్షన్!

Salaar: వైలెన్స్.. వైలెన్స్.. సలార్‌లో కేజీఎఫ్‌ను మించి యాక్షన్!

Salaar

Salaar: అందరి అంచనాల్ని మించి కెజిఎఫ్ 2 సూపర్ హిట్.. ఇప్పుడు అందరి దృష్టి ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ మీదే ఉంది. అందులోనూ గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా సలార్. రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతోంది. కెజిఎఫ్ ని మించి ఎలా తెరకెక్కిస్తాడో, కెజిఎఫ్ ని మించి సలార్ లో ఇంకేం చూపిస్తాడో అని రకరకాల డౌట్లతో రకరకాల ఎక్స్ పెక్టేషన్స్ తో హాట్ టాపిక్ అవుతోంది సలార్.

Salaar: అప్పుడు రాధేశ్యామ్.. ఇప్పుడు సలార్ ఇంత లేట్ ఏంటి మాస్టారు?

వైలెన్స్ .. వైలెన్స్.. వైలెన్స్.. ఐ డోంట్ లైకిట్.. ఐ అవాయిడ్ బట్.. వైలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవాయిడ్.. రాకీభాయ్ కి వైలెన్స్ ఇష్టం లేదు. కాని, వైలెన్స్ రాకీభాయిని ఇష్టపడితే ఏ రేంజ్ లో ఉంటుందో కేజిఎఫ్ 2 లో చూపించారు ప్రశాంత్ నీల్. మరి ఇప్పుడు ద మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా సలార్ లో ప్రభాస్ ను చూపించబోతున్నట్టు పోస్టర్ లోనే రివీల్ చేశారు ప్రశాంత్ నీల్. అంటే సలార్ ఏ రేంజ్ వైలెన్స్ తో భీబత్సం సృష్టించబోతున్నారో ముందే హింట్ ఇస్తున్నారు. అసలే ప్రభాస్ వైలెన్స్ కింగ్.. ఇక సలార్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో అంటూ ఆడియన్స్ లో ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

Salaar: వెర్రి ఫ్యాన్స్.. సలార్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటా!

ఆర్ఆర్ ఆర్, కెజిఎఫ్ లోనే నెవర్ బిఫోర్ యాక్షన్ ని ఎమోషన్ ని చూశాం.. అంతకంటే ఏ లెవల్ లో ప్రభాస్ ని పిక్చరైజ్ చెయ్యబోతున్నారో అంటూ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్యాన్స్ మధ్య నడుస్తోంది. కెజిఎఫ్ 2 లో యాక్షన్ కంటే నెక్ట్స్ లెవల్ యాక్షన్ ఉండేలా, అంతకుమించి ప్రభాస్ స్టేచర్ కి తగినట్టు ఎలివేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సలార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారని ఇప్పటికే అనౌన్స్ చేసింది టీమ్. దాదాపు 60పర్సెంట్ కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసింది సలార్ టీమ్. ఇంటర్వెల్ సీన్ ని ఏకంగా 20 కోట్లతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ టీమ్ తో తెరకెక్కించినట్టు సమాచారం.

Salaar: యష్ నెవర్ బిఫోర్ యాక్షన్.. అంతకుమించి ప్రభాస్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్!

సలార్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ప్రభాస్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా శృతి హాసన్ నటిస్తోంది. సలార్ అనే ఉర్దూ పదానికి ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపే వాడని అర్థం. సెప్టెంబర్, అక్టోబర్ కల్లా సలార్ షూటింగ్ ఫినిష్ చేయాలని చూస్తున్న ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ 2 తర్వాత ప్రభాస్ ను ఏ సామ్రాజ్యానికి నాయకుడిగా చూపించబోతున్నాడో అని ఫిలిం సర్కిల్స్ లో టాక్ హాట్ టాపిక్ అవుతోంది. సలార్ ఫ్యాన్స్ కోసం అప్ డేట్స్ షేర్ చేసుకోవడానికి స్పెషల్ గా సలార్ ట్విట్టర్ హాండిల్ ని క్రియేట్ చేసినట్టు తాజాగా హోంబలే ఫిలింస్ అనౌన్స్ చేసింది.