NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

ప్రస్తుతం సాయి ధరమ్ తన 15 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. SDT15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. కాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా..

NTR : సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ మాట సాయం..

NTR voiceover for Sai Dharam Tej 15 movie

Updated On : December 5, 2022 / 5:18 PM IST

NTR : గత ఏడాది కాలంగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి ఎటువంటి సినిమా అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. దీంతో ఈ హీరో, అభిమానులకు వరుసపెట్టి అప్డేట్ లు ఇస్తున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తన 15 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. SDT15 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

NTR: తేజు కోసం మరోసారి ఆ ఫీట్ చేయనున్న తారక్..?

గ్రామీణ ప్రాంతంలో జరిగే కొన్ని ఘటనల ఆధారంగా మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ డిసెంబర్ 7న టైటిల్ గ్లింప్స్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా.. ఈ టైటిల్ గ్లింప్స్ కి టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు మూవీ మేకర్స్.

గతంలో ‘భీమ్ ఫర్ రామ్’ అంటూ RRR లో రామ్ చరణ్ క్యారెక్టర్‌ని తారక్ ఇంట్రడ్యూస్ చేయడంతో, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ క్యారెక్టర్ కి కూడా ఇది హెల్ప్ అవుతుందో చూడాలి. కాగా ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథని అందిస్తుండగా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ ఫేమ్ ‘సంయుక్త మీనన్’ హీరోయిన్ గా నటిస్తుంది.