నువ్వు తోపురా – టీజర్

సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న నువ్వు తోపురా టీజర్ రిలీజ్.

  • Published By: sekhar ,Published On : February 7, 2019 / 12:38 PM IST
నువ్వు తోపురా – టీజర్

సుధాకర్ కోమాకుల హీరోగా నటిస్తున్న నువ్వు తోపురా టీజర్ రిలీజ్.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమాకుల హీరోగా, నువ్వు తోపురా అనే సినిమా రాబోతుంది. బేబీ జాహనవి సమర్పణలో, యునైటెడ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతుంది. నిత్యా శెట్టి హీరోయిన్‌. సీనియర్ నటి దివ్యవాణి హీరో మథర్‌గా నటిస్తుంది. పక్కా తెలంగాణా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కబోయే నువ్వు తోపురా.. అమెరికాలోనూ షూటింగ్ జరుపుకుంది. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసారు. సుధాకర్ యాక్టింగ్, హీరోయిన్‌తో అతని కెమిస్ట్రీ బాగుంది.

జీవితంలో రాజీ పడడం, ఏ విషయంలోనూ ఒంగి ఉండడం తెలియని ఒక కుర్రాడు, జాబ్ కోసం అమెరికా వెళ్ళి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, తన క్యారెక్టర్ మార్చుకున్నాడా? ప్రేమని దక్కించుకున్నాడా, లేదా అనే పాయింట్స్‌తో, నువ్వు తోపురా రూపొందుతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. వెంకట్ సి దిలీప్ కెమెరా వర్క్, సురేష్ బొబ్బిలి, దీపక్ ఆర్ఆర్ బాగుంది. యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న నువ్వు తోపురా ఆడియో త్వరలో రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సినిమాకి ఆర్ట్ : తోట తరణి, ఎడిటింగ్ : ఎస్‌బి ఉద్ధవ్, నిర్మాత : శ్రీకాంత్, దర్శకత్వం : హరినాధ్ బాబు.

వాచ్ టీజర్…