Ginna: రంగంపేట ప్రెసిడెంట్ తిప్పేస్వామిగా ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు

మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో కమెడియన్ రఘుబాబు పాత్రకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

Ginna: రంగంపేట ప్రెసిడెంట్ తిప్పేస్వామిగా ఎంట్రీ ఇచ్చిన రఘుబాబు

Raghu Babu As Tippeswamy In Manchu Vishnu Ginna Movie

Ginna: మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు సూర్య తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణు పక్కా పల్లెటూరి అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామలు పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటిస్తున్నారు.

Ginna Trailer: జిన్నా ట్రైలర్.. కామెడీతో నవ్వించిన మంచు విష్ణు!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా, ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సినిమాలో కమెడియన్ రఘుబాబు పాత్రకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రంగంపేట ప్రెసిడెంట్ తిప్పేస్వామి పాత్రలో రఘుబాబు నటిస్తున్నట్లు ఈ పోస్టర్‌లో వెల్లడించింది చిత్ర యూనిట్. ఇక ఈ పాత్ర కూడా ఆద్యంతం నవ్వులు పూయించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

Ginna Trailer: ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన జిన్నా

హార్రర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా జిన్నా సినిమా వస్తుండటంతో ఈ సినిమాలో సన్నీ లియన్, పాయల్ రాజ్‌పుత్‌లతో కలిసి మంచు విష్ణు ఎలాంటి రచ్చ చేశాడా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించగా, అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.