Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరంపై సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి కామెంట్స్

మన ముగ్గురి లవ్ స్టోరీ, సెబాస్టియన్ PC 524, పంచతంత్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొన్న సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం గురించి సినిమాటోగ్రఫర్ రాజ్ కె నల్లి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Kiran Abbavaram: హీరో కిరణ్ అబ్బవరంపై సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి కామెంట్స్

Raj K Nalli Comments About Kiran Abbavaram

Kiran Abbavaram: మన ముగ్గురి లవ్ స్టోరీ, సెబాస్టియన్ PC 524, పంచతంత్రం వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకొన్న సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషనల్ హీరో కిరణ్ అబ్బవరం, సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, భరత్ రొంగలి నటీనటులుగా.. ‘SR కళ్యాణ మండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు.

Kiran Abbavaram : సమ్మతమే కథ ఇదేనా??

‘SR కళ్యాణ మండపం’ లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారు రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. జులై 8న ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో సినిమాటోగ్రాఫర్ రాజ్ కె. నల్లి పాత్రికేయులతో మాట్లాడారు.

Kiran Abbavaram : పవన్ దెబ్బకి వెనక్కి తగ్గిన మరో యువ హీరో

కిరణ్‌తో నాకిది రెండవ ప్రాజెక్ట్.. కిరణ్‌ను డిఫరెంట్‌గా చూపించాలని తనను కొత్తగా చూపించడం జరిగింది. అయితే కిరణ్ సినిమా సినిమాకు ఇంప్రూవ్ అవ్వడానికి తను చాలా కష్టపడతాడు. కిరణ్ చాలా కూల్ గోయింగ్ యాక్టర్. తనకు లైనప్‌లో 10 సినిమాలున్నాయి. తనకు ఎంత టెన్షన్ ఉన్నా సీన్ దగ్గరికి వచ్చేసేరికి సీన్ ఎమోషన్స్ మూడ్ పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు. చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. తను బేసిక్‌గా ఎడిటర్ కాబట్టి ఎడిటర్ పాయింట్ అఫ్ వ్యూలో షాట్ మేకింగ్ చాలా ఇంట్రెసింగ్‌గా ఉంటుంది.. అంటూ పాత్రికేయులతో ముచ్చటించారు.