Rajamouli : ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా సినిమా తీసే విధానం మారదు

రాజమౌళి సమాధానమిస్తూ.. ''RRRకు ఆస్కార్‌ వస్తే సంతోషమే. కానీ దాని వల్ల తాను తీయబోయే నెక్స్ట్ సినిమా, దాన్ని తెరకెక్కించే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. RRRకు ఆస్కార్‌ వచ్చినా, రాకున్నా నా తర్వాత సినిమాలో..............

Rajamouli : ఆస్కార్ వచ్చినా రాకపోయినా నా సినిమా తీసే విధానం మారదు

Rajamouli said that even if I get an Oscar, my film making will not change

Rajamouli :  రాజమౌళి బాహుబలి సినిమాతోనే మన తెలుగు చిత్రపరిశ్రమ స్థాయిని పెంచాడు. ఇక RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ప్రపంచం నలుమూలలా మన గొప్పతనాన్ని చాటాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రేక్షకులు, టెక్నీషియన్లు, ప్రముఖులు.. చాలా మంది RRR సినిమాని అభినందించారు. ఇక హాలీవుడ్ లో అయితే రాజమౌళి మేకింగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసి అక్కడి ఫిలిం ఫెస్టివల్స్ కి రాజమౌళిని పిలుస్తున్నారు, ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన సినిమాలు షోలు వేస్తున్నారు.

RRR సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని పలు హాలీవుడ్ మీడియాలు అంటున్నాయి. తాజాగా RRR సినిమాని న్యూయార్క్ లోని IFC సెంటర్‌లో ప్రీమియర్‌ షో వేశారు. షో అనంతరం విలేకరులతో, ప్రేక్షకులతో రాజమౌళి మాట్లాడాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానం ఇచ్చాడు. RRRకి ఆస్కార్ వస్తుందంటున్నారు, వస్తే మీ నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు.

Paga Paga Paga : ఈ సినిమాని మీరు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ఫ్రీగా చూడొచ్చు.. ఇదెక్కడి ప్రమోషన్ రా బాబు..

దీనికి రాజమౌళి సమాధానమిస్తూ.. ”RRRకు ఆస్కార్‌ వస్తే సంతోషమే. కానీ దాని వల్ల తాను తీయబోయే నెక్స్ట్ సినిమా, దాన్ని తెరకెక్కించే విధానంలో ఎలాంటి మార్పు ఉండదు. RRRకు ఆస్కార్‌ వచ్చినా, రాకున్నా నా తర్వాత సినిమాలో ఎలాంటి మార్పు ఉండదు. ఆస్కార్‌ అవార్డు అనేది నైతికంగా అటు సినిమాలకు, ఇటు దేశానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక ఫిల్మ్‌మేకర్‌గా నన్ను నేను మరింత మెరుగు పరుచుకోవాలి. నేను నా నేటివిటీకి తగ్గట్టు సినిమా తీస్తే ప్రపంచం అంతా ఇష్టపడింది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతాను” అని తెలిపారు. ఇక RRR సినిమాకి ఆస్కార్ రావాలని అందరూ కోరుకుంటున్నారు.