Paga Paga Paga : ఈ సినిమాని మీరు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ఫ్రీగా చూడొచ్చు.. ఇదెక్కడి ప్రమోషన్ రా బాబు..

 ఇటీవల సినిమా ప్రమోషన్లు రోజు రోజుకి మరింత కొత్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చిన్న సినిమా యూనిట్ ఇంకో అడుగు ముందుకేసి తమ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితంగా చుపిస్తాము అంటున్నారు..............

Paga Paga Paga : ఈ సినిమాని మీరు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ఫ్రీగా చూడొచ్చు.. ఇదెక్కడి ప్రమోషన్ రా బాబు..

Paga Paga Paga movie first day first show free to every one

Updated On : September 20, 2022 / 11:05 AM IST

Paga Paga Paga : ఇటీవల సినిమా ప్రమోషన్లు రోజు రోజుకి మరింత కొత్తగా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ చిన్న సినిమా యూనిట్ ఇంకో అడుగు ముందుకేసి తమ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితంగా చుపిస్తాము అంటున్నారు. అభిలాష్‌ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా రవి శ్రీ దుర్గా ప్రసాద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పగ పగ పగ’. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సంగీతం అందించడంతో పాటు ఇందులో విలన్ గా ఓ రోల్ ని కూడా చేశారు.

Abhinaya Sri : బిగ్‌బాస్ అంతా మోసం.. నాకు రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు.. నాకంటే తక్కువ ఓట్లు వచ్చినా..

ఈ సినిమా సెప్టెంబరు 22న విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమ సినిమాని ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోను అందరికీ ఉచితంగా చూపిస్తామని ప్రకటించారు. ‘పగ పగ పగ’ సినిమా రిలీజైన అన్ని థియేటర్స్ లో మొదటి రోజు మొదటి ఆట ఉచితంగా ఎవరైనా వచ్చి చూడొచ్చని చిత్ర యూనిట్ తెలిపింది. మరి ఇంకే మీకు దగ్గర్లో ఈ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో చూసుకొని ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి ఫ్రీగా చూసి వచ్చేయండి.