Rajinikanth: కాంతారాపై రజిని ప్రశంసలు..

రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా, KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కన్నడ చిత్రం ‘కాంతార’. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. దేశంలోని పలు స్టార్ హీరో హీరోయిన్లు కాంతార సినిమాని, దర్శకుని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్...

Rajinikanth: కాంతారాపై రజిని ప్రశంసలు..

Rajinikanth comments on Kantara movie

Rajinikanth: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ హీరో హీరోయిన్ గా, KGF సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కన్నడ చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో రిలీజై భారీ హిట్ కొట్టి అక్కడ మంచి కలెక్షన్లని సాధించింది. దీంతో ఇటీవల తెలుగు, హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కన్నడలోని గ్రామదేవతల నేపథ్యంతో వచ్చిన ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Kantara : కర్ణాటకలో కాంతార సినిమా చూస్తూ గుండెపోటుతో 45 ఏళ్ళ వ్యక్తి కన్నుమూత..

దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురుస్తుంది. దేశంలోని పలు స్టార్ హీరో హీరోయిన్లు కాంతార సినిమాని, దర్శకుని అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. “తెలిసిన వాటికంటే తెలియనివి ఎక్కువ. వాటిని తెలియజేసేలా చిత్రీకరించిన కాంతార సినిమా ఒక అద్భుతం. రిషబ్ శెట్టి నీ రచనకి, దర్శకత్వానికి, నటనకి హాట్సాఫ్. మొత్తం మూవీ టీంకి నా అభినందనలు” అంటూ ట్విట్ చేశాడు.

దీనికి రిషబ్ శెట్టి బదిలిస్తూ.. “రజిని సార్ నేను మీకు చిన్నప్పటి నుంచి అభిమానిని. ఇండియన్ సూపర్ స్టార్ అయిన మీ నుంచి అభినందనలు అందుకోవడం నాకు ఒక కల లాంటిది. మీ ఈ అభినందనలు నన్ను మరిన్ని స్థానిక కథలు తీసేలా ప్రేరేపిస్తున్నాయి. థాంక్యూ సార్” అంటూ ట్విట్ చేశాడు. కాగా ఈ మూవీ కన్నడలో అత్యధికులు చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది.