Rakshit Shetty : రష్మికతో బ్రేకప్ పై రక్షిత్ శెట్టి వైరల్ కామెంట్స్.. నా వ్యక్తిగత జీవితమే..!
రక్షిత్ శెట్టి కన్నడ సినిమా 'సప్త సాగర దాచే ఎల్లో' తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లో రక్షిత్ శెట్టి తన పెళ్లి విషయంలో ఆసక్తికరమైన కామెంట్లు చేసారు.
![Rakshit Shetty : రష్మికతో బ్రేకప్ పై రక్షిత్ శెట్టి వైరల్ కామెంట్స్.. నా వ్యక్తిగత జీవితమే..! Rakshit Shetty : రష్మికతో బ్రేకప్ పై రక్షిత్ శెట్టి వైరల్ కామెంట్స్.. నా వ్యక్తిగత జీవితమే..!](https://10tv.in/wp-content/uploads/2023/09/New-Project-4-39.jpg)
Rakshit Shetty
Rakshit Shetty : రక్షిత్ శెట్టి కన్నడలో పాపులర్ యాక్టర్. పాన్ ఇండియా సినిమాలు చేసి పేరు తెచ్చుకున్నారు. తాజాగా రక్షిత్ నటించిన కన్నడ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమా తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ రిలీజ్ అయ్యింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పెళ్లి టాపిక్ ఎత్తగానే రక్షిత్ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’ సెప్టెంబర్ 1 న కన్నడలో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో సెప్టెంబర్ 22 న రిలీజ్ అయ్యింది. తెలుగులో ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. రక్షిత్ శెక్టి, రుక్మిణీ వసంత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాని హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేసారు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న రక్షిత్ శెట్టి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. రష్మికతో బ్రేకప్ అయ్యి దాదాపు 5 సంవత్సరాలు గడిచినా పెళ్లెందుకు చేసుకోలేదనే ప్రశ్నకు తను పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టానని పర్సనల్ జీవితాన్ని మర్చిపోయానని రక్షిత్ శెట్టి చెప్పారు. ప్రస్తుతం పెళ్లి ప్లాన్స్ ఏమీ లేవని సినిమాలపైనే తన మొత్తం ఫోకస్ అంతా అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన లవ్ అంతా సినిమా అని స్పష్టం చేసారు. రక్షిత్ కామెంట్స్ బట్టి చూస్తే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లుగా తెలుస్తోంది.
Rashmika Mandanna : విజయ్ దేవరకొండపై రష్మిక అలక.. అందుకేనా?
రక్షిత్ శెట్టి నటించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ రెండు భాగాలుగా తీస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. రక్షిత్ శెట్టి కిరిక్ పార్టీ, అతడే శ్రీమననారాయణ, చార్లీ 777, గోధి బన్న సాధారణ మైకట్టు వంటి పాన్ ఇండియా సినిమాలు చేసారు.