Ram Charan : రోజురోజుకి రెట్టింపు అవుతున్న రామ్‌చరణ్ క్రేజ్..

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ రోజురోజకి రెట్టింపు అవుతూ పోతుంది. 'ఆర్ఆర్ఆర్'లో తన నటనా విశ్వరూపం చూపించి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాడు. తన బాడీ మెంటేన్స్ చూసి అమ్మాయిలు సైతం చరణ్ కి ఫిదా అయిపోతున్నారు. ఇక తన డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్స్ తో అబ్బాయిలకు స్టైల్ ఐకాన్ గా నిలుస్తున్నాడు.

Ram Charan : రోజురోజుకి రెట్టింపు అవుతున్న రామ్‌చరణ్ క్రేజ్..

Ram Charan : టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ రోజురోజకి రెట్టింపు అవుతూ పోతుంది. ‘ఆర్ఆర్ఆర్’లో తన నటనా విశ్వరూపం చూపించి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాడు. తన బాడీ మెంటేన్స్ చూసి అమ్మాయిలు సైతం చరణ్ కి ఫిదా అయిపోతున్నారు. ఇక తన డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్స్ తో అబ్బాయిలకు స్టైల్ ఐకాన్ గా నిలుస్తున్నాడు.

Ram Charan: రీమేక్‌లపై చరణ్ కామెంట్.. ఫుల్ క్లారిటీతో ఉన్నాడుగా!

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ 10 మిలియన్‌ల మార్క్ ని అందుకుంది. దీంతో చరణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో సందడి చేస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తరువాత క్రేజ్ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే ముందు వరసులో నిలిస్తున్నాడు రామ్ చరణ్. కారణం తను అభిమానులతో తరుచుగా సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అయ్యి ఉండడం.

మరి ఈ విషయాన్ని గమనించి మిగతా హీరోలు కూడా.. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టకుండా, ఇప్పటినుంచి అయినా అభిమానులకు అందుబాటులో ఉంటే మంచిది. కాగా ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామా మూవీని తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్, కియారా అద్వానీ మీద పాటను తెరకెక్కించడానికి న్యూజిలాండ్ వెళ్లిన టీమ్, నిన్న ఆ షెడ్యూల్ ని పూర్తీ చేసుకొని తిరిగి పయనమయ్యారు.