Salaar : సలార్ ఆ మూవీకి రీమేక్.. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్..!

ప్రభాస్ సలార్ సినిమా ఆ మూవీకి రీమేక్ గానే వస్తుంది. కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. ఇంతకీ ఏంటి ఆ మూవీ..?

Salaar : సలార్ ఆ మూవీకి రీమేక్.. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్..!

Ravi Basrur confirms Prabhas Salaar is remake of that kannada movie

Updated On : October 2, 2023 / 4:12 PM IST

Salaar : ప్రభాస్ (Prabhas) ‘సలార్’ సినిమా పై ఏ రేంజ్ హైప్ నెలకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కుస్తుండడం, ప్రభాస్ హీరో అవ్వడంతో పాన్ ఇండియా ఆడియన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై ఒక రూమర్ గత కొంత కాలంగా నెట్టింట వైరల్ అవుతూ వస్తుంది. అదేంటంటే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన మొదటి మూవీ ‘ఉగ్రమ్’ కథతోనే సలార్ ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. గతంలో ఈ రూమర్ గురించి ఉగ్రమ్, సలార్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్న రవి బస్రూర్ ని ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నించారు.

Skanda Collections : బాక్స్ ఆఫీస్ వద్ద రామ్ ‘స్కంద’ కలెక్షన్స్ దూకుడు..

దీనికి రవి బస్రూర్ బదులిస్తూ.. “అది అందరికి తెలిసిన విషయమే. ఉగ్రమ్ లో శ్రీమురళి ఎలా చేసాడో చూశారు. ఇప్పుడు సలార్ లో ప్రభాస్ ఎలా చేశాడు అనేది చూస్తారు” అని చెప్పుకొచ్చాడు. అప్పటిలో ఇది బాగా వైరల్ అయ్యింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ పై ప్రశాంత్ నీల్ రియాక్ట్ అవుతూ.. “రీమేక్ ఏమి కాదు. కొత్త కథతోనే వస్తున్నాము” అంటూ తెలియజేశాడు. కాగా మొన్నటి వరకు యూట్యూబ్ లో ఉగ్రమ్ మూవీ హిందీ వెర్షన్ అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు దానిని కూడా తొలిగించారు.

Ghost Trailer : ‘ఘోస్ట్’ ట్రైలర్.. నేను వెళ్తే రణరంగం మారణహోమంగా మారుతుంది.. శివన్న యాక్షన్ ఫీస్ట్..

దీంతో ఇప్పుడు ఈ రీమేక్ వార్తలు మళ్ళీ హాట్ టాపిక్ అయ్యాయి. రవి బస్రూర్ వీడియోని వైరల్ చేస్తూ.. సలార్ ఉగ్రమ్ కి రీమేక్. అందుకనే ఉగ్రమ్ హిందీ వెర్షన్ ని డిలీట్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఉగ్రమ్ మూవీ సమయంలో అప్పటి హీరో అండ్ మేకర్స్ మార్కెట్ తగ్గట్టు ఆ కథని చిన్నగా తెరకెక్కించారట. ఇప్పుడు ఆ కథని కొన్ని మార్పులు చేసి భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

ఇక ఉగ్రమ్ కథ విషయానికి వస్తే.. చిన్నతనంలో తన కుటుంబానికి సహాయం చేసిన తన మిత్రుడికి హెల్ప్ చేసేందుకు హీరో క్రైమ్ సిండికేట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఒక గ్యాంగ్ ఎదుగుతాడు. అయితే కొన్నాళ్ళకు స్నేహితుడితోనే గొడవ రావడంతో ఆ గ్యాంగ్ స్టార్ జీవితాన్ని వదిలేసి వైలెన్స్ దూరంగా వెళ్ళిపోతాడు. అలాంటి హీరో లైఫ్ లోకి హీరోయిన్ రావడం, హీరో మళ్ళీ వైలెన్స్ పై అడుగులు వేయడం మిగిలిన కథ.