Raviteja : తమ్ముడి కొడుకుని లాంచ్ చేసిన రవితేజ.. పెళ్లి సందD డైరెక్టర్ తో..
ఇండస్ట్రీలో మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో..................

Raviteja Brother son Maadhav entry as Hero
Raviteja : ఇండస్ట్రీలో మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాస్ మహరాజ్ రవితేజ(Raviteja) తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం అయింది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఈ చిత్రం రూపొందబోతోంది. శ్రీకాంత్ కొడుకు రోషన్ ని లాంచ్ చేస్తూ పెళ్లి సందD(Pelli Sandadi) చిత్రంతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి ఇప్పుడు రవితేజ తమ్ముడి కొడుకుని కూడా లాంచ్ చేయబోతుంది.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో జరగగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత సురేష్ బాబు, బెక్కెం వేణుగోపాల్ గారు, చదలవాడ శ్రీనివాసరావు, డైరెక్టర్ లక్ష్మి సౌజన్య.. మరికొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ ను అందజేయగా, నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాఘవేంద్రరావు హీరో మాధవ్ పై క్లాప్ కొట్టారు.
Dil Raju : RRR టీంకు దిల్ రాజు సంస్థ స్పెషల్ గిఫ్ట్స్..
ఇక మాధవ్ ఫొటోని రవితేజ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మాధవ్ కి అల్ ది బెస్ట్ తన డెబ్యూట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే హీరోయిన్, మరిన్ని వివరాలు ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.
Wishing my boy #Maadhav all the very best for his debut :))))
May you all bless and shower him with all your love 🤗 #GowriRonanki #YalamanchiRani #JJREntertainmentsLLP pic.twitter.com/FBNvUsitiG
— Ravi Teja (@RaviTeja_offl) March 23, 2023
Introducing @RaviTeja_offl brother #Raghu son #Maadhav as hero.😍
Clicks from #JJREntertainmentsLLP #YalamanchiRani Presents ,Production No 2 movie launch.✨
Directed by #PellisandaD fame #GowriRonanki. More details soon.🤟 pic.twitter.com/zMK3Telku4— BA Raju's Team (@baraju_SuperHit) March 23, 2023