Ramgopal varma : నేను మంచి సినిమాలు తీయను.. శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి
తన మీద సెటైరిక్‌గా మాట్లాడిన నటుడు శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చారు ఆర్జీవి. 'తలకోన' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో శివాజీరాజా కామెంట్స్.. ఆర్జీవి కౌంటర్ చర్చనీయాంశంగా మారాయి.
![Ramgopal varma : నేను మంచి సినిమాలు తీయను.. శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి Ramgopal varma : నేను మంచి సినిమాలు తీయను.. శివాజీరాజాకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవి](https://10tv.in/wp-content/uploads/2023/10/New-Project-8-15.jpg)
Ramgopal varma
Ramgopal varma : అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన ‘తలకోన’ సినిమా సాంగ్స్, ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజాల మధ్య జరిగిన సంభాషణ వైరల్ అవుతోంది. శివాజీరాజా కామెంట్స్‌కి ఆర్జీవి ఇచ్చిన కౌంటర్ చర్చనీయాంశంగా మారింది.
నగేశ్ నారదాసి డైరెక్షన్ లో వస్తున్న ‘తలకోన’ సినిమా నవంబర్ రెండోవారంలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటుడు శివాజీ రాజా, నిర్మాత రామారావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో నటుడు శివాజీ రాజా ఆర్జీవిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అందుకు ఆర్జీవీ ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతున్నాయి.
‘ఆర్జీవి తీసిన అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ తీయలేదని.. ఆయన తీసిన చెత్త సినిమాలు కూడా ఎవరూ తీయలేదంటూ’ శివాజీ రాజా ఆర్జీవీపై కామెంట్ చేసారు. దానికి వెంటనే ఆర్జీవి రెస్పాండ్ అయ్యారు. తాను మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి రాలేదన్నారు ఆర్జీవి. డెస్టెనీ వల్ల పొరపాటున వాటిలో కొన్ని మంచివి అయ్యాయని దానికి తాను బాధ్యుడను కానని కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.