హీరోయిన్లపై కామెంట్స్.. ‘శాక్రిఫైజ్ స్టార్’ సునిశిత్ అరెస్ట్..

  • Published By: sekhar ,Published On : July 24, 2020 / 12:53 PM IST
హీరోయిన్లపై కామెంట్స్.. ‘శాక్రిఫైజ్ స్టార్’ సునిశిత్ అరెస్ట్..

టాలీవుడ్ హీరోయిన్లు కొందరు తన లవర్స్ అంటూ వారిపై కామెంట్స్ చేస్తున్న ‘శాక్రిఫైజ్ స్టార్’ సునిశిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు..
సునిశిత్‌ ఇటీవల పలు యూట్యూబ్‌ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనకు తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వారి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా అసభ్య పదజాలంతో వారిని దూషించాడు. ఇక మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలకు తనే బ్రేక్ ఇచ్చానని చెప్తూ.. ఇంటర్వూ చేసే వాళ్లకి చూసే వాళ్లకి పిచ్చెక్కించాడు. ఈ క్రమంలోనే సునిశిత్‌పై ఇబ్రహీంపట్నం, కీసర పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.

Sacrifice Star

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సునిశిత్‌ అరెస్ట్‌ చేశారు. కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్‌పై గతంలో హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతణ్ణి చూసైనా కెమెరా ముందు అడ్డదిట్టంగా మాట్లాడేవాళ్లు కంట్రోల్ అవుతారేమో చూడాలి..