Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కానుకగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Sai Dharam Tej: తేజు బర్త్‌డే గిఫ్ట్.. SDT15 నుండి ఇంటెన్స్ పోస్టర్!

Sai Dharam Tej Intense Poster Out From SDT15

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కానుకగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Sai Dharam Tej: జల్సా రీ రిలీజ్ లో సుప్రీమ్ హీరో రచ్చ..

సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను పూర్తి మిస్టరీ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. కాగా, ఈ సినిమా నుండి ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఓ గుంపును ఉద్దేశించి తేజు ఏదో మాట్లాడుతున్నట్లుగా మనకు వెనకాల నుండి ఈ పోస్టర్‌లో చూపించారు. ఇక ఈ సినిమాలో తేజు సరికొత్తగా కనిపిస్తాడని చిత్ర యూనిట్ చెబుతోంది.

Sai Dharam Tej: బ్యాక్ టు సెట్స్‌లో ఎమోషనల్ అయిన తేజు

ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.