Sai Dharam Tej: బ్యాక్ టు సెట్స్‌లో ఎమోషనల్ అయిన తేజు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల ఆయన ఓ వీడియో....

Sai Dharam Tej: బ్యాక్ టు సెట్స్‌లో ఎమోషనల్ అయిన తేజు

Sai Dharam Tej Gets Emotional On Sdt15 Sets

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఇటీవల ఆయన ఓ వీడియో చేసి తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. అంతేగాక తన కొత్త చిత్రానికి సంబంధించిన విషయాలను కూడా తేజు ఆ వీడియోలో తెలియజేశాడు. ఇక తన కొత్త చిత్రాన్ని తేజు నేడు ప్రారంభించాడు. తేజు చాలా గ్యాప్ తరువాత సెట్స్‌లో అడుగుపెట్టడంతో, ఆయనకు చిత్ర యూనిట్ సభ్యులు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

Sai Dharam Tej: యాక్సిడెంట్ తరువాత సాయి ధరమ్ తేజ్ తొలి వీడియో!

దీంతో తేజు సంతోషంతో ఎమోషనల్ అయ్యారు. తన రాక కోసం ఇంత మంది అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండటంతో ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటుడు ఆర్.నారాయణ మూర్తి, దర్శకుడు సుకుమార్ సాయి ధరమ్ తేజ్‌కు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. తేజు తిరిగి సినిమా షూటింగ్‌లో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఇక తేజు నటిస్తున్న 15వ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటి నుండి నిర్విరామంగా జరుపుకుంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

Sai Dharam Tej : సినిమాలకు ఓకే చెప్పిన సాయి ధరమ్ తేజ్.. కొత్త సంవత్సరంలో షూటింగ్??

ఈ సినిమాను ఓ మిస్టరీ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్‌తో పాటు సుకుమార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలోని మిగతా నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో తేజు ఎంట్రీకి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియోలో పోస్ట్ చేయగా, ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఏదేమైనా తేజు తిరిగి షూటింగ్ సెట్స్‌కు రావడం సంతోషంగా ఉందని అభిమానులు అంటున్నారు.