AP Weather Alert : జూన్ 14న ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దు.. అధికారుల హెచ్చరిక!
AP Weather Alert : ఏపీలో ఆదివారం (జూన్ 14న) భారీ వర్షాలు పడనున్నాయి. పిడుగులతో కూడిన ఈదురుగాలులు మోస్తారు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Alert ( Image Credit : AI )
- ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
- 23 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు భారీ వర్షాలు
- చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దు
AP Weather Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో మేఘావృతంగా వాతావరణం మారిపోతోంది. ఈ క్రమంలో జూన్ 14న ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఆదివారం మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో పిడుగులతో కూడిన ఈదురు గాలులు, మోస్తారు భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ మేరకు భారత వాతావరణ శాఖ (IMD) ఒక ప్రకటనలో వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది.
చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దని సూచనలు చేసింది. పిడుగుల పడే సమయంలో రైతులు, పశుకాపరులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అంతేకాదు.. విద్యుత్ వైర్లు తెగిపడితే దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ఇప్పటికే మార్కాపురం జిల్లా కోవిలంపాడులో 41 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అనంతపురం తెరన్నపల్లిలో 24 మి.మీ వర్షం, కడప జిల్లా సింహాద్రిపురంలో 22.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచనలు చేశారు.
