Topcos : సౌత్ ఇండియా ప్రొడ్యూసర్స్ కలిసి.. ‘టెలివిజన్ & ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)..
తాజాగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. (Topcos)
Topcos
Topcos :2026 జనవరిలో చెన్నైలో అన్ని సౌత్ టీవీ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కలిసి ‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేశారు. తాజాగా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మెట్ లో టాప్కోస్ అధ్యక్షుడు ఏ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. నాలుగు రాష్ట్రాల నిర్మాతల మండళ్లు కలిసి ఒక ఆర్గనైజేషన్ గా ఏర్పడటం ఇదే మొదటిసారి. దీని వెనకాల రెండున్నరేళ్ల కృషి ఉంది. 2011లో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పడింది. 15యేళ్లు పూర్తి చేసుకుంది. తెలుగు టివి పరిశ్రమకు, నిర్మాతలు, నటీ నటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు అందరికీ పెద్ద దిక్కుగా తెలుగు కౌన్సిల్ నిలబడింది. ఓ మూడేళ్ల నుంచి ఇంటర్ స్టేట్ ప్రొడక్షన్స్ బాగా పెరిగాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎక్జేంజ్ పెరిగింది. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్లి వర్క్ చేస్తున్నారు. అందుకే నాలుగు రాష్ట్రాల నిర్మాతల మధ్య ఒక సమన్వయం ఉంటే బాగుంటుంది అని వేరే రాష్ట్రాల నిర్మాతలతో చర్చించి ఇది స్థాపించాము. మాకు ఉన్న ప్రతి సమస్యను పరిశీలించి అనేక చర్చల తర్వాత ఒక బై లా తయారు చేసుకున్నాము. అన్ని ఇండస్ట్రీలలో కామన్ గా ఉండే ఇష్యూస్ మీద నాలుగు భాషల నిర్మాతల మండళ్లు కలిసి పనిచేయాలి అనేది మా లక్ష్యం. మా తర్వాతి టార్గెట్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అన్ని భాషల్లో ఉన్న టివి, ఓటిటి నిర్మాతలందరినీ కలిపి నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం అనేది మా లక్ష్యం అని అన్నారు.
Also Read : Samantha : రాజ్ ఒక్కడే అలా చేస్తాడు.. ఏ డైరెక్టర్ అలా చేయడు.. సమంత సంచలన వ్యాఖ్యలు..
టాప్కోస్ వైప్ ప్రెసిడెంట్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. నేను ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు టెలివిజన్ అండ్ ఓటిటి అసోసియేషన్. ఒకప్పుడు వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మిగతా భాషల్లో కూడా అదే పరిస్థితి. దీనికి పరిష్కారంగా అందరం కలిసి మాట్లాడుకున్నాం అని అన్నారు. కర్ణాటక ఎగ్జిక్యూటివ్ మెంబర్ సునిల్ కుమార్ జే.కే మాట్లాడుతూ.. కర్ణాటకలో మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ తెలుగు ఇండస్ట్రీ చూసి మేం అవాక్కయ్యాం. వీళ్లు ఎంత బాగా ఈ అసోసియేషన్ నడిపిస్తారు అని చూసి అసూయపడ్డాం. వీళ్ళను కలిసి ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం అని అన్నారు. కేరళ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణన్ సేతుకుమార్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియన్ టెలివిజన్ ఇండస్ట్రీకి ఇదో చారిత్రాత్మకమైన రోజు. మేమంతా కలిసి ఈ కౌన్సిల్ ముందుకు తీసుకువెళ్లడానికి, టెలివిజన్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
చెన్నై ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా వేలు మాట్లాడుతూ.. మాకు చెన్నైలో చెప్పేవారు.. హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా బాగా చేస్తున్నారు అని. అది విన్నాం. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది. వాళ్లు చాలా ఆర్గనైజ్డ్, చాలా డిసిప్లిన్డ్ అని. మా దగ్గర యాక్టర్స్ చాలా సమస్యలు ఉన్నాయి. నిర్మాతలు చాలా నష్టపోతున్నాం. ఈ కష్టాల నుంచే కౌన్సిల్ పుట్టింది అన్నారు.
Also Read : Chiranjeevi : ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్.. నాకు కెపాసిటీ ఉంది.. నేను రెడీ..
