Salaar: సలార్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ "సలార్". కెజిఫ్ వంటి భారీ ఫ్రాంచైజ్ సినిమాలను అందించిన డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Salaar: సలార్ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది..

Salaar Movie Crazy Update

Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ “సలార్”. కెజిఫ్ వంటి భారీ ఫ్రాంచైజ్ సినిమాలను అందించిన డైరెక్టర్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

Prabhas: “ధృవ” కథ ప్రభాస్ కోసం రాశా.. మోహన్ రాజా!

కాగా ఈ చిత్రంలో ప్రభాస్ ని ఢీ కొట్టే పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నాడు. ఈ రోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు కావడంతో అయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీం. ఈ సినిమాలో ఈ నటుడు “వర్ధరాజ మన్నార్” పాత్రతో తన విలనిజం చూపించబోతున్నాడు.

అయితే ఇంతకుముందు ఈ చిత్రం నుండి జగపతి బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయగా, అయన రాజా మన్నార్ పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. దీంతో ఈ రెండు పేర్లను బట్టి చూస్తే జగపతిబాబు, పృథ్వీరాజ్‌లు ఈ సినిమాలో తండ్రీకొడుకులు లేదా అన్నదమ్ములుగా నటిస్తున్నారంటూ ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.