Samantha : ఇన్ని బాధలు పడతాను అని అనుకోలేదు.. టీనేజర్స్ కి సమంత సలహాలు..

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది. అయితే ఓ అభిమాని ఇప్పటి టీనేజర్లకు మీరేమైనా సలహాలు ఇస్తారా అని అడిగారు.

Samantha : ఇన్ని బాధలు పడతాను అని అనుకోలేదు.. టీనేజర్స్ కి సమంత సలహాలు..

Samantha Suggestions to Youth about Life Comments goes Viral

Updated On : September 20, 2023 / 10:41 AM IST

Samantha :  సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మాయోసైటిస్(Myositis) చికిత్స కోసం అమెరికా(America)కు వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికాలోనే కొన్ని నెలల పాటు ఉండి పూర్తిగా మాయోసైటిస్ నయమయ్యే వరకు చికిత్స తీసుకొని, కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఇండియాకు తిరిగి రావాలని సమంత డిసైడ్ అయింది. అమెరికాలో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది సమంత. ఇటీవల రెగ్యులర్ గా పోస్టులు, తన జిమ్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది. అయితే ఓ అభిమాని ఇప్పటి టీనేజర్లకు మీరేమైనా సలహాలు ఇస్తారా అని అడిగారు.

Samantha : మయోసైటిస్‌ చికిత్స కోసం స్టెరాయిడ్స్.. అందుకే సమంత ఫేస్ ఇంతలా మారిపోయిందా?

దీనికి సమంత సమాధానమిస్తూ.. ఇప్పటి యూత్ కి అంటే.. చాలా మంది చిన్న చిన్న కష్టాలకు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారు. జీవితం ఇంకా మొదలే అవ్వలేదు. చిన్న చిన్నవాటికి బాధపడటం మానేయండి. మీ ప్రయాణంలో ఇంకా చాలా కష్టాలు, సమస్యలు రావొచ్చు. వాటన్నిటిని తట్టుకొని నిలబడగలగాలి. ధైర్యంగా ఉంటే అవే మనకి జీవితం గురించి నేర్పిస్తాయి. 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను అసలు ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంటాను అనుకోలేదు. నా జీవితంలో ఇన్ని ఇబ్బందులు కూడా పడతాను అని అనుకోలేదు. వాటన్నిటిని పాజిటివ్ గా ఎదుర్కుంటూ వచ్చాను. మీరు కూడా అలాగే ఎదుర్కొని ముందుకి సాగాలి అని చెప్పింది. దీంతో సామ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.