Samyuktha Menon: మలయాళ మందారం సంయుక్త.. స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా?

ఒక్కో పీరియడ్ లో ఒక్కో ప్రాంతానికి చెందిన హీరోయిన్స్ తెలుగు తెర మీద హవా చూపిస్తుంటారు. ఆ మధ్య ఉత్తరాది భామల హవా కనిపించగా ఇప్పుడు కన్నడ భామల జోరు కొనసాగుతుంది

Samyuktha Menon: మలయాళ మందారం సంయుక్త.. స్టార్ స్టేటస్ అందుకోవడం పక్కా?

Samyuktha Menon

Samyuktha Menon: ఒక్కో పీరియడ్ లో ఒక్కో ప్రాంతానికి చెందిన హీరోయిన్స్ తెలుగు తెర మీద హవా చూపిస్తుంటారు. ఆ మధ్య ఉత్తరాది భామల హవా కనిపించగా ఇప్పుడు కన్నడ భామల జోరు కొనసాగుతుంది. మరోవైపు మలయాళ కుట్టీలు కూడా తెలుగు తెర మీద తన లాక్ పరీక్షించుకొని ఇక్కడే స్టార్స్ స్టేటస్ అందుకుంటున్నారు. అలాంటి మెటీరియలే సంయుక్త మీనన్. 2016లోనే మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సంయుక్త అక్కడ బిజీ హీరోయిన్ గా ఎదిగింది.

Samyuktha Menon : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ సందడి

అక్కడ నుండి కలరి సినిమాతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. గాలిపట 2 సినిమాతో త్వరలో కన్నడ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇక తెలుగుకు వస్తే సంయుక్త ముందు సైన్ చేసిన సినిమా కళ్యాణ్ రామ్ బింబిసార. అయితే ఆ సినిమా కన్నా ముందే భీమ్లా నాయక్ రిలీజయింది. సినిమాలో రానా జోడీగా ఆమె కనిపించగా.. పాత్రకి మించి మార్కులు కొట్టేసింది. ఒరిజినల్ సినిమా కన్నా ఇందులో సంయుక్త పాత్రను పెంచడం.. దానికి వంద శాతం ఆమె న్యాయం చేయడంతో అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది.

Bheemla Nayak : పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో అదరగొట్టిన హీరోయిన్ సంయుక్త మీనన్

ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అచ్చ తెలుగులో స్పష్టంగా మాట్లాడి ఇండస్ట్రీని ఆకర్షించిన సంయుక్త ఈ ఏడాది డెబ్యూ హీరోయిన్స్ లో స్టార్ మెటీరియల్ అని అంతా ఫిక్సయిపోయారు. ఎలాగో ఈ ఏడాదిలోనే బింబిసార విడుదల కానుండగా.. సితార బ్యానర్ పై వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ధనుష్ పాన్ ఇండియా సినిమా సార్ కూడా ఈ ఏడాదే రానుంది. ఇవి కాకుండా మరో రెండు స్టార్స్ సినిమాలు దక్కితే సంయుక్త స్టార్ హీరోయిన్ కావడం పక్కా అని అర్ధమైపోతుంది.