Satya Dev: కృష్ణమ్మ టీజర్.. వైలెంట్‌గా మారిన సత్యదేవ్!

టాలీవుడ్‌లో విలక్షణమైన యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు సత్య దేవ్. తాజాగా ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు సత్యదేవ్ రెడీ అయ్యాడు. ఈ చిత్ర టీజర్‌ను మెగా సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.

Satya Dev: కృష్ణమ్మ టీజర్.. వైలెంట్‌గా మారిన సత్యదేవ్!

Satya Dev: టాలీవుడ్‌లో విలక్షణమైన యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు సత్య దేవ్. క్యారెక్టర్ పాత్రల నుండి హీరోగా ఎదిగిన సత్యదేవ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ‘గాడ్సే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా ‘కృష్ణమ్మ’ అనే సినిమాతో మనముందుకు వచ్చేందుకు సత్యదేవ్ రెడీ అయ్యాడు.

Satyadev : ఈ సినిమాకి నాథూరామ్‌ గాడ్సే కథకు ఎలాంటి సంబంధం లేదు.. పవన్ కోసం రాసిన సినిమా..

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో వస్తున్న ‘కృష్ణమ్మ’ సినిమాను దర్శకుడు వివి.గోపాల కృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ టీజర్‌ను రిలీజ్ చేశాడు. ఇక ఈ టీజర్‌ను చూస్తే ప్రేక్షకులను ఆకట్టునే కథతో ఈ సినిమా రాబోతుందనే విషయం అర్థమవుతోంది. పూర్తిగా ఊరమాస్ అవతారంలో సత్యదేవ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిజజీవితంలో జరిగిన కొన్ని యధార్ధ కథల ఆధారంగా దర్శకుడు గోపాలకృష్ణ ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు అనాధలు తమకు జరిగిన అన్యాయానికి కారణమైన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నారనేది ఈ సినిమా కథగా చూపించబోతున్నారు.

Godse: ‘గాడ్సే’కు ఎసరుపెడుతున్న ప్రమోషన్స్!

ఈ సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తుండగా అథిరా రాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు కాలభైరవ సంగీతాన్ని అందిస్తుండగా, కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాతో సత్యదేవ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో తెలియాలంటే ‘కృష్ణమ్మ’ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.